తెలంగాణ

Hyd : ‘నిలోఫర్’లో గర్భిణీలు నిలబడి ఉండాల్సిందేనా?

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో ప్రసూతి కేసులు ఎక్కువగా చూసే నిలోఫర్ ఆస్పత్రిలో సౌకర్యాలు కరువయ్యాయి. గర్బిణీ మహిళలు వస్తే కనీసం వారు కూర్చోవడానికి కుర్చులు కరువయ్యారని,పట్టించుకునే వారే లేరని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం కోసం నగరంలోని చాలా మంది పేదలు ఇక్కడికి వస్తుంటారు.

రాష్ట్రంలో ప్రసూతి కేసులు ఎక్కువగా చూసే నిలోఫర్ ఆస్పత్రిలో సౌకర్యాలు కరువయ్యాయి. గర్బిణీ మహిళలు వస్తే కనీసం వారు కూర్చోవడానికి కుర్చులు కరువయ్యారని,పట్టించుకునే వారే లేరని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం కోసం నగరంలోని చాలా మంది పేదలు ఇక్కడికి వస్తుంటారు.కానీ, మేనెజ్మెంట్ నిర్వహణలోపం కారణంగా గర్బిణీలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ గర్బిణీ ఆస్పత్రికి వస్తే పట్టించుకునే వారు లేక సదరు మహిళ నిలబడి ఉన్నట్టు సమాచారం.

మరోవైపు ఆస్పత్రిలో బెడ్స్ కూడా లేవని తెలుస్తోంది. నిలోఫర్ ఆసుపత్రిలో బెడ్స్ లేక గంటల తరబడి కుర్చీలపై గర్భిణీలు పడిగాపులు గాస్తున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఉదయం నుంచి కుర్చీల మీదే గర్భిణీలు ఉంటున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖైరతాబాద్‌కు చెందిన ఓ మహిళ ఉదయం 11:40 గంటలకు ఆసుపత్రికి రాగా, రాత్రి 10 గంటలకు సిబ్బంది బెడ్ ఇచ్చినట్టు సమాచారం.

గర్భిణీ కుటుంబసభ్యులు తాము వేరే ఆసుపత్రికి వెళ్తామని చెప్పినా ఇక్కడ అడ్మిషన్ అయ్యాక వెళ్లడానికి వీల్లేదని ఆసుపత్రి సిబ్బంది నిరాకరించినట్టు తెలిసింది.అయితే, నిలోఫర్ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది అమానవీయ ప్రవర్తనతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. దీనిమీద ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా బెడ్స్,కుర్చీలు ఏర్పాటు చేయాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోతే మెరుగైన వైద్యం ఎలా అందుతుందని పలువురు ప్రశ్నలు లేవెనెత్తుతున్నారు.

https://x.com/TeluguScribe/status/2084496355192623322?s=20

#niloufar hospital#medicalcare#hyderabad#no chairs#no beds
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి