సినిమా

Rakul Preet Singh: రకుల్ ని తెలుగు మేకర్స్ మాత్రమే వదిలేశారా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rakul Preet Singh:టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ, ఇప్పుడు ఈ బ్యూటీని తెలుగు మేకర్స్ అసలు పట్టించుకోవడం లేదు. అలాగని, ఈ బక్కపలచని బ్యూటీ ఖాళీగా ఏమీ లేదు. హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన రకుల్..ఇప్పుడు కేవలం హిందీలో మాత్రమే బిజీగా ఉంది.

దీనికి, కారణం ఇక్కడ వరుసగా ఫ్లాపులొచ్చాయి. పైగా రకుల్ మన ప్రేక్షకులకి బోర్ కొట్టేసిన హీరోయిన్. ఆడియన్స్ కి బోర్ కొట్టి మేకర్ కి హిట్స్ లేకపోతే హీరోయిన్ ఇట్టే మార్చేస్తారు. మళ్ళీ, అవకాశం రావాలంటే చాలా కష్టం. తెలుగులో ఐతే ప్రస్తుతం రకుల్ పరిస్థితి ఇదే. కానీ, బాలీవుడ్ లో మాత్రం మైథలాజికల్ మూవీ రామాయణలో అద్భుతమైన పాత్రలో అలరించబోతోంది.

హిందీలో, ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వాటిలో రొమాంటిక్ లవర్ పాత్రలో నటించిన రకుల్ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ బాగానే ఫిదా అయ్యారు. ఆ సినిమాలే, దే దే ప్యార్ దే2, పతి పత్నీ ఔర్ ఓ దో. ఈ రెండితోనూ వరుస హిట్స్ అందుకుంది. ఇప్పుడు, నితీష్ తివారి రూపొందిస్తున్న రామాయణ రెండు భాగాలలో శూర్పణఖ పాత్రలో మెరవబోతోంది.

ఇది, నెగిటివ్ పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, గ్లామర్ టచ్..విలనీగా ఆకట్టుకుంటుందని ఇటీవల వచ్చిన రామాయణ ట్రైల్‌తో అర్థమైంది. ఇలాంటి, పాత్రల్లో నటించే అవకాశం ఎవరికైనా ఒక్కసారే వస్తుంది. కాబట్టే, ఈ పాత్ర ఎంతో లోతైనదని..భావోద్వేగాలను బాగా పండించగల అవకాశం ఉందని రామాయణలో ఈ రోల్ ఒప్పుకున్నట్టుగా రకుల్ తెలిపింది. ఇక, సినిమాలో ఏ మేరకూ ఆకట్టుకుందో గానీ, ట్రైలర్ లో మాత్రం సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి కంటే శూర్పణఖగా నటిస్తున్న రకుల్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి.

#rakulpreethsingh#ramayana#nithihtiwari#saipallavi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి