National

Breaking: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

తమిళనాడు రాజకీయాల్లో సినీ నటి త్రిష పేరు చుట్టూ చెలరేగిన వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సీఎం విజయ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్.. త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీవీకే నేతలు ఫిర్యాదు చేయడంతో చెన్నై పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడు రాజకీయాల్లో సినీ నటి త్రిష పేరు చుట్టూ చెలరేగిన వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సీఎం విజయ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్.. త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీవీకే నేతలు ఫిర్యాదు చేయడంతో చెన్నై పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు.

స్టాలిన్ వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని టీవీకే, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వివాదం తంజావూరులో డీఎంకే నిర్వహించిన కావేరీ నదీ జలాల నిరసన ప్రదర్శనలో చోటుచేసుకుంది. సీఎం విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో సభలో పాల్గొన్న కొందరు కార్యకర్తలు ‘త్రిష.. త్రిష..’ అంటూ బిగ్గరగా అరిచారు. ఆ సమయంలో ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్.. త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ నవ్వుతూ నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా, అక్కడికైతే నీళ్లు చేరాల్సిందే (నేను అన్నది కావేరీ నీళ్ల గురించే)” అని డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది.

అయితే తాను మాట్లాడింది కేవలం కావేరీ జలాల గురించేనంటూ ఉదయనిధి తదనంతరం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే పార్టీ శ్రేణులు అత్యంత ఘాటుగా స్పందించాయి. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయలేక, మహిళలను కించపరిచేలా మాట్లాడటం డీఎంకే దిగజారుడు రాజకీయాన్ని ప్రతిబింబిస్తోందని టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, ఉదయనిధిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

అదేవిధంగా బీజేపీ కూడా ఈ ప్రవర్తనను సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.  ఇటీవలి కాలంలో తమిళనాడు రాజకీయ వర్గాల్లో త్రిష పేరు విస్తృతంగా ప్రచారంలోకి వస్తుండటం, ఈ క్రమంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నేతలు ఇలా నోరుజారడం పట్ల ప్రజల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ సభల్లో మహిళలను వస్తువులుగా చిత్రీకరిస్తూ చవకబారు వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి మంచిది కాదని పలువురు హితవు పలుకుతున్నారు. మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

#Udayanidhi stalin arrest#Udhayanidhi Stalin#Trisha Krishnan#TVK Vijay#DMK Controversy#Tamil Nadu Politics#Double Meaning Remark#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి