Tamannaah: మిల్కీ బ్యూటీగా సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ లోనూ ఒక ఊపు ఊపేసిన తమన్నా ఇప్పుడు కూడా చేతిలో అరడజను సినిమాలతో అస్సలు ఖాళీ లేకుండా గడుపుతోంది. గత కొంతకాలంగా స్పెషల్ నంబర్స్ కే ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తమన్నా హిందీ, తమిళంలో చేసిన స్పెషల్ నంబర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.
హీరోయిన్‌గా కంటే స్పెషల్ నంబర్స్ లోనే ఎక్కువగా సంపాదించిందనుకోవచ్చు. అయితే, ఇంతగా డాన్స్ చేసే ఈ మిల్కీ బ్యూటీ ప్రత్యేకంగా మాత్రం ఎలాంటి డాన్స్ నేర్చుకోలేదట. మన తెలుగు, తమిళ సినిమాలు చేస్తున్నప్పుడే నేరుగా సెట్స్‌లోనే కొరియోగ్రాఫర్స్ చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసి కెమెరా ముందుకు వచ్చేదట. ఇదే, విషయాన్ని తమన్నా తాజాగా వెల్లడించింది.
ఈ విషయంలో ఎవరైనా తనకి డాన్స్ రాదని కామెంట్స్ చేస్తే బాధ పడేందుకు కూడా సమయం ఉండేది కాదట. ఇక, తెలుగులో మంచు మనోజ్ నటించిన శ్రీ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించిన రచ్చ మూవీతో స్టార్ హీరోయిన్‌గా మారింది. తమన్నాకి ఇంతటి పాపులారిటీ రావడానికి కారణం తన డాన్స్ అని ఎంతో ప్రత్యేకంగా చెప్పాలి.
తెలుగులో ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలుగా నిలిచాయి. ముఖ్యంగా, బాహుబలి ఆమె కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. తమన్నా బెల్లీ డాన్స్ కి, నాభి అందాలకి విపరీతమైన అభిమానులున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ దాదాపు అందరు హీరోలతో ఆడిపాడింది. తెలుగులో నటించిన ఆఖరి చిత్రం ఓదెల 2. దీని, తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. కానీ, హిందీ..తమిళ భాషలో 6 చిత్రాలతో బిజీగా ఉంది. ఇప్పటికీ, తమన్నా 5 నుంచి 6 గంటలు మాత్రమే నిద్రపోతుందంటే ఆశ్చర్యపోవాల్సిందే.












