సినిమా

Mrunal Thakur: (x) లో మృణాల్ అసభ్యకరమైన ఫొటోలు..ఎవరినీ వదలను..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Mrunal Thakur: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చాక జనాలకి మేలు ఎంత జరుగుతుందో తెలీదు గానీ, ఉద్యోగులైతే రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వందల్లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. లక్షల్లో జీతాలు తీసుకున్న ఉద్యోగులు కాస్తా ఒక్కసారిగా దిక్కుతోచని స్థితికి వచ్చేశారు. మంచి ప్యాకేజీ ఉందని ఇల్లు, కార్లు కొనుక్కున్న వారి పరిస్థి ఆగమ్యగోచరంగా మారింది. ప్రతీ వ్యవస్థపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంపాక్ట్ గట్టిగా పడుతోంది.

అయితే, దీని వల్ల కొందరు ఆకృత్యాలకి పాల్పడటం కూడా ఊహించని పరిణామం. ముఖ్యంగా సినీ తారలను టార్గెట్‌గా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా న్యూడ్ ఫొటోస్, డీప్ ఫేక్ వీడియోస్ తయారు చేసి సెలబ్రిటీల పేరుతోనే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దీనివల్ల కొందరు నిజంగానే హీరోయిన్స్ ఇలా బరితెగించారేంటని.. నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు అత్యుత్సాహంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ ఫోటోలను, వీడియోలను క్షణాల్లో షేర్ చేసేస్తున్నారు. గతంలో, ఇలాంటి వారి బారిన పడ్డ రష్మిక మందన్న, సమంత, ఆలియా భట్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు, ఆ లిస్ట్ లో మృణాల్ ఠాకూర్ చేరింది. తన ఎక్స్ హ్యాండిల్ పేజ్ లో డూప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేసి డీప్ ఫేక్ కంటెంట్ ని షేర్ చేశారు.

ఇది, మృణాల్ కి షాక్ కి గురి చేయడమే కాకుండా తీవ్ర ఆగ్రహానికి గురైయ్యేలా చేసింది. దీంతో, సీరియస్ గా రియాక్ట్ అయింది. వెంటనే వాటిని తొలగించకపోతే యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. క్రియేట్ చేసిన వాళ్లనే కాదు..ఇతరులకి షేర్ చేసిన వారినీ వదలని సోషల్ మీడియా ద్వారా సీరియస్ అయింది. అంతేకాదు, హై కోర్టును కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది.

#MrunalThakur#ActressMrunalThakur#samantha#RashmikaMandanna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి