వైరల్ న్యూస్

Life Partner Expectations: కాబోయే భార్యపై వింత ఆంక్షలు.. సోషల్ మీడియాలో యువకుడి పోస్ట్ తీవ్ర దుమారం!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

సోషల్ మీడియా మోజులో కొట్టుమిట్టాడుతున్న నేటి యువత, పెళ్లి విషయంలో వాస్తవాలకు దూరంగా కల్పలోకంలో విహరిస్తోంది. జీవిత భాగస్వామి ఎంపిక కోసం సోషల్ మీడియా రీల్స్, ఫిల్టర్లతో కూడిన ఊహాప్రపంచాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ, ఆకాశమే హద్దుగా అంచనాలు పెంచేసుకుంటోంది.

సోషల్ మీడియా మోజులో కొట్టుమిట్టాడుతున్న నేటి యువత, పెళ్లి విషయంలో వాస్తవాలకు దూరంగా కల్పలోకంలో విహరిస్తోంది. జీవిత భాగస్వామి ఎంపిక కోసం సోషల్ మీడియా రీల్స్, ఫిల్టర్లతో కూడిన ఊహాప్రపంచాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ, ఆకాశమే హద్దుగా అంచనాలు పెంచేసుకుంటోంది. రూపురేఖల నుంచి హోదా వరకు అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు అడిగే వింత వింత షరతులు చూస్తుంటే.. వారు కోరుకున్న స్వప్న సుందరులు లేదా మిస్టర్ పర్ఫెక్ట్‌లు దొరకాలంటే ఈ జన్మలో సాధ్యం కాదని, ఇంకో జన్మ ఎత్తాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా ఓ యువకుడు తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ సుదీర్ఘమైన నిబంధనల జాబితా ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సదరు యువకుడు ప్రతిపాదించిన షరతులు విన్న నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా, అతడి మానసిక వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ యువకుడు పంచుకున్న నిబంధనల ప్రకారం... తనకు కాబోయే భార్య కచ్చితంగా వర్జిన్ అయి ఉండాలని, ఎలాంటి మేకప్ వేసుకోకుండా కేవలం సహజ సిద్ధమైన అందంతో మాత్రమే ఉండాలని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఆమె సరిగ్గా 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు, కచ్చితంగా 45 కిలోల బరువు మాత్రమే ఉండాలని వింత నిబంధన పెట్టాడు. అన్ని రకాల వంటకాలను వండటం ఆమెకు తెలిసి ఉండాలని, గతంలో ఎలాంటి ప్రేమ వ్యవహారాలు (నో పాస్ట్) ఉండకూడదని షరతు విధించాడు.

కేవలం శరీర కొలతలు, రూపురేఖలే కాకుండా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛపై కూడా సదరు యువకుడు తీవ్రమైన ఆంక్షలు విధించాడు. కాబోయే భార్య ఫెమినిస్ట్ కాకూడదని, అసలు సోషల్ మీడియా ఖాతాలు వాడకూడదని ఆదేశించాడు. బాయ్ ఫ్రెండ్స్(మగ స్నేహితులు)  ఎవరూ ఉండకూడదని, బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా ముందస్తుగా తన అనుమతి తీసుకోవాలని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆమె తన లైవ్ లొకేషన్‌ను 24గంటలు తనతో పంచుకోవాలని, తన తల్లిదండ్రులను సొంత తల్లిదండ్రులలా చూసుకోవాలంటూ పేర్కొన్నాడు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది పెళ్లి కోసం పెట్టిన అర్హతల జాబితా లాగా లేదని, ఓ మనిషిని బానిసగా మార్చుకోవడానికి రూపొందించిన నిరంకుశ నియమావళిలా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నేటి సమాజంలో 24 గంటల లైవ్ లొకేషన్, ఫ్రెండ్స్ ఉండకూడదనే షరతులు విధించడం అతడి అనుమానాస్పద, నియంతృత్వ మనస్తత్వానికి అద్దం పడుతోందని, ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో జీవితం నరకప్రాయమవుతుందని సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

#Social Media Marriage Trends#Life Partner Expectations#Youth Wedding Culture#Relationship Realities#Modern Marriage Expectations#Social Media Influence#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి