Tollywood: సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మన టాలీవుడ్, కోలీవుడ్ కంటే కూడా సినిమాల మేకింగ్ పరంగా..నటీనటుల రెమ్యూనరేషన్స్ పరంగా శాండిల్‌వుడ్ లో చాలా తక్కువ. కేజీఎఫ్ సిరీస్ రాకముందు అక్కడ భారీ బడ్జెట్ సినిమా అంటే 10 కోట్ల లోపే ఉండేది. కానీ, ఇప్పుడు వాళ్ళు కూడా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కన్నడ సినిమాకి అసాధారణ పాపులారిటీ వచ్చింది.
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా పరభాషా నటీమణులది హవా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా, కన్నడ భామల క్రేజ్ టాలీవుడ్‌లో ఎక్కువగా ఉంది. ఇప్పుడు, మన టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించిన రష్మిక మందన్న కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామ కావడం విశేషం. అంతేకాదు, సీనియర్ నటి అనుష్క శెట్టి..డాన్సింగ్ క్వీన్ శ్రీలీల లాంటి వాళ్ళు కూడా కన్నడ భామలే. శ్రీలీల తెలుగమ్మాయి అయినా, కన్నడలో హీరోయిన్‌గా పరిచయమైంది. అక్కడే ఉంటోంది.
ఇక, ఈ మధ్యకాలంలో వరుసగా తెలుగు సినిమాలు చేస్తోన్న శ్రీనిధి శెట్టి కూడా కన్నడ గ్లామర్ బ్యూటీనే. కేజీఎఫ్ సిరీస్‌తో క్రేజీ హీరోయిన్‌గా మారిన శ్రీనిధి శెట్టి..తెలుగులో హిట్ 3, తెలుసు కదా సినిమాలు చేసింది. ఇప్పుడు, వెంకటేష్ సరసన నటించిన ఆదర్శ కుటుంబం సినిమాతో మన ముందుకు రాబోతోంది. అమిగోస్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆషిక రంగనాథ్ కూడా కన్నడ భామే.
అయితే, బాలీవుడ్ నుంచి హీరోయిన్‌ను మన టాలీవుడ్‌కి తీసుకోవాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంది. రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తుంటారు. వారి మేయిన్‌టైనెన్స్ ఎక్కువ. అలాగే, తమిళ హీరోయిన్స్ కూడా కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తుంటారు. కానీ, కన్నడ నుంచి వచ్చే హీరోయిన్స్ కి ఇక్కడ ఇచ్చే రెమ్యూనరేషన్ తక్కువే. ప్రధానంగా, మన తెలుగు మేకర్స్ కన్నడ హీరోయిన్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపించేది రెమ్యూనరేషన్ పరంగా. అందుకే, ఎక్కువగా కన్నడ భామల హవానే కొనసాగుతుంది.


