సినిమా

Venkatesh: 100 కోట్లకి తగ్గని సీనియర్ హీరో!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Venkatesh: మన సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ సినిమాల పరంగా చాలా దూకుడుగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వెంకీ చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దీంతో, సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున లలో చూసుకుంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో వెంకీమామనే. అంతేకాదు, అసలు గ్యాప్ లేకుండా సినిమాలను లైనప్ చేస్తున్నాడు.

Venkatesh: మన సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ సినిమాల పరంగా చాలా దూకుడుగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వెంకీ చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దీంతో, సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున లలో చూసుకుంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో వెంకీమామనే. అంతేకాదు, అసలు గ్యాప్ లేకుండా సినిమాలను లైనప్ చేస్తున్నాడు. ఇప్పుడు, ఆయన నటిస్తున్న జనవరి 12 విడుదల 100 కోట్లకి పైగానే ప్రీ బిజినెస్ జరిగిందట.

300 కోట్ల క్లబ్‌లో సంక్రాంతికి వస్తున్నాం:

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ నష్టాలపాలైన సమయంలో ఆయనను బయటకి లాగింది వెంకీమామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమానే. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో భారీ విజయాన్ని అందుకుంది.

చిరుతో చేసిన సినిమా కూడా 300 కోట్ల గ్రాస్:

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన మన శంకరవరప్రాద్‌గారు సినిమా కూడా ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వచ్చి 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఇలా, వెంకటేష్ నటించిన సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో అక్టోబర్ 30న రిలీజ్ కాబోతున్న ఆదర్శ కుటుంబం సినిమా, 2027 సంక్రాంతికి రాబోతున్న జనవరి 12 విడుదల చిత్రాలకి ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లకి పైగా జరిగిందట. ఈ రెండు సినిమాలు గనక హిట్ టాక్ తెచ్చుకుంటే గ్యారెంటీగా నిర్మాతలకి భారీ లాభాలే. మొత్తానికి, సీనియర్ హీరోలలో వెంకీ సినిమాలు 100 కోట్లకి పైగానే బిజినెస్ జరుపుకోవడం విశేషం.

#Venkatesh#Aadarsha Kutumbam#Trivikram#Srinidhi Setty#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి