తెలంగాణ

TG : టార్గెట్ తుమ్మిడిహెట్టి.. సీఎం రేవంత్ ముంబై పర్యటన ఫిక్స్

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

తెలంగాణలోని సాగు,తాగు నీటి రంగానికి ప్రాణం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఎప్పటినుంచే ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేయాలని చూస్తోంది.

తెలంగాణలోని సాగు,తాగు నీటి రంగానికి ప్రాణం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఎప్పటినుంచే ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేయాలని చూస్తోంది.ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని చూస్తోంది. అందుకు మహారాష్ట్ర సర్కార్ అభ్యంతరం చెబుతోంది. ముంపు ప్రభావం తమకు ఎక్కువగా ఉంటుందని,అందుకు సమ్మతించబోమని గతంలో పేర్కొంది.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం వచ్చే సోమవారం ముంబైలో పర్యటించనుంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర సాగునీటి వివాదాలు, బ్యారేజీల నిర్మాణంపై ఈ పర్యటనలో కీలక చర్చలు జరపనున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడమే ప్రధాన అజెండాగా ముంబై పర్యటన సాగనుందని సమాచారం.

ఈసారైనా మహా సర్కార్ ఒప్పుకుంటుందా?

152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సర్కార్ అంగీకరించడం లేదు. అక్కడి ముంపు ప్రాంతాల్లోని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అందుకు అంగీకరించడం లేదు. 148 మీటర్లకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఒకవేళ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఎత్తును 150 మీటర్లుగా నిర్ణయిస్తే, అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు ఎంత పరిమాణంలో నీటిని తరలించవచ్చనే సాంకేతిక వివరాలు, లెక్కలపై సీఎం రేవంత్ ఇప్పటికే అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి ఒక అవగాహనకు వచ్చినట్టు తెలిసింది.

ఈనెల 26న మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే రెండేళ్లలో తుమ్మడిహెట్టిని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది. ఫలితంగా ఉత్తర తెలంగాణలో సాగు జోరందుకోనుంది. ప్రాజెక్టులు సైతం కళకళ లాడనున్నాయి.

#tummidihetti project#maharastra tour#cm revanthreddy team#irrigation projects#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి