టాప్ న్యూస్

BRS : రేవంత్ సర్కారుకు జల గండం..! కన్నెపల్లికి బీఆర్ఎస్ బృందం!

రచన: Kumar••9 నిమిషాల పఠనం

ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో తీవ్ర కరువు రాబోతుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం అందుకు సంసిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నీరు, విద్యుత్ వృథా చేయకూడదని చెబుతోంది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిక కురవకపోవడంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి.

ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో తీవ్ర కరువు రాబోతుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం అందుకు సంసిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నీరు, విద్యుత్ వృథా చేయకూడదని చెబుతోంది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిక కురవకపోవడంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు జల విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. దీంతో కేవలం థర్మల్ విద్యుత్ పైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. వేసవి రాకముందే ఎండలు తీవ్రతరం కావడంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగింది. దీంతో కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఓవైపు సాగు నీరు లేక, మరోవైపు కరెంట్ కోతల కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాంకర్లు, బోరు బావులే దిక్కు..

ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో 17 శాతానికి పైగా లోటు వర్షపాతం నెలకొంది.దీంతో కరువు కోరలు చాస్తోంది.పల్లెలు,పట్టణాల్లో నీటి ఎద్దడి మొదలైంది. ఓవైపు పొలాలకు సాగు నీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటుతుండటతో పట్టణాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో గృహ సముదాయాలు, ఆఫీసుల్లో నీటి సమస్య తీవ్రంగా మారింది. దీంతో రైతులు బోరుబావులనే నమ్ముకుంటున్నారు.బోర్లు లేని చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పారిస్తున్నారు.ఇక నగరాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. బోర్లలో నీరు లేక వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, స్కూల్స్, కాలేజీలు, అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వాటర్ ట్యాంకర్లే దిక్కయ్యాయి.

కాళేశ్వరం వరప్రదాయని...

రాష్ట్రంలో సాగు, తాగు నీటిని అందించే కీలక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతుందన్నందున రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సాగు చేయొద్దని, ఆరు తడి పంటలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. వరికి హాలిడే ప్రకటించాలని స్పష్టంచేసింది. ఇప్పుడు ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సాగుకోసం వినియోగిస్తే రానున్న రోజుల్లో తాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయని ప్రభుత్వం చెబుతోంది.అందుకే సాగు కంటే ఇప్పుడు తాగు నీరు ముఖ్యమని చెబుతోంది. ఇదిలాఉండగా, కాళేశ్వరంలోని కన్నెపల్లి వద్ద గోదావరి వరద సమృద్ధిగా ఉందని, వెంటనే నీటిని ఎత్తిపోయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఎత్తిపోయడం వలన సాగు, తాగుకు ఇబ్బంది ఉండదని చెబుతోంది.

పట్టించుకోని సర్కార్..

కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోతుందని ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే నీరు ఎత్తిపోయడం లేదని చెబుతోంది. ఏదైనా జరిగితే భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే అవకాశం ఉందని, అందుకే చేసేది లేదని రేవంత్ సర్కార్ భీష్మించుకుని కూర్చుంది. కాగా,కన్నెపల్లి వద్ద భారీగా గోదావరి జలాలు దిగువకు వెళ్ళిపోతున్నాయి. ఏపీ సర్కార్ వాటిని ఒడిసిపట్టి రాయలసీమకు తరలిస్తోందని, కానీ, మన గడ్డ మీద ఉన్ననీటిని ఎలా వాడుకోవాలని కాంగ్రెస్ సర్కారుకు తెలియడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

కన్నెపల్లికి బీఆర్ఎస్ నేతలు..

రాష్ట్రంలో కన్నెపల్లి వద్ద గోదావరి వరద ప్రవాహం సమృద్ధిగా ఉన్నా రేవంత్ సర్కార్ కావాలనే పంటలకు నీరు ఇవ్వకుండా ఎండబెడుతోందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అయితే, ప్రతిపక్షాలు అబద్ధం చెబుతున్నాయని అధికార పార్టీ నేతలు ఖండిస్తున్నారు.ఈ క్రమంలోనే కన్నెపల్లి వద్ద వరద ఎంత మేర ఉంది?వాటిని ఎత్తిపోస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక బృందంగా ఏర్పడి కన్నెపల్లి సందర్శనకు బయలుదేరారు. మేడిగడ్డ వద్ద ఇప్పటికే 751 టీఎంసీల నీళ్లు కిందికి వదిలేశారని, అందులో 200 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసినా హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు, రైతులకు నీళ్లు అందించేవారని తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు.

ఇప్పటికీ కూడా మేడిగడ్డ వద్ద 22 వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు పారుతున్నాయని, ఈ నీటిని లిఫ్ట్ చేసి కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, అలా రాకూడదనే కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అందుకే కన్నెపల్లి వద్ద గోదావరి జలాల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోను చూపించి..కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించేందుకు గులాబీ నేతలు బయలుదేరినట్టు తెలిసింది. కన్నెపల్లికి సందర్శనకు వెళ్లిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.

సర్కారుకు జల గండం..

రేవంత్ సర్కారును జల గండం వెంటాడుతున్నట్టు తెలుస్తోంది.ఎల్ నినో నేపథ్యంలో కరువు రావడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే మార్కెట్లో బియ్యం, నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి. ఈసారి నీరు లేక పంట దిగుబడి భారీగా పడిపోయే చాన్స్ ఉంది. మరోవైపు యాసంగికి వరి పోస్టుపోన్ చేయాలని సర్కార్ చెబుతోంది.ఫలితంగా మార్కెట్లో బియ్యానికి కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే కేజీ బియ్యం రూ.100వరకు చేరింది. వచ్చే ఏడాది మరింత పెరగచ్చు. నీరులేకపోవడం వలన పప్పు ధాన్యాల దిగుబడి, కూరగాయల సాగు కూడా భారం కానుంది. అది కాస్త చివరకు సామాన్య ప్రజల మీదే ధరల భారం మోపనుంది. దీనిని బూచిగా చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయ్యిందని ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే రాష్ట్ర ప్రజలు, రైతులకు తాగు, సాగు నీరు సకాలంలో అందించాల్సి ఉంటుంది.లేదా ఎన్నికల ఫలితాలు తలకిందులు కానున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగా అధికార పార్టీ మద్దతు ఇచ్చిన కార్మిక సంఘం ఓడిపోయిన విషయం తెలిసిందే.

#cm revanth reddy#congress#water issues#agriculture#drinking water#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి