తెలంగాణ

TG: లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్.. హైదరాబాద్ పవర్ గ్రిడ్ ఆఫీస్‌లో కలకలం!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: హైదరాబాద్ కవాడిగూడలోని పవర్ గ్రిడ్ ఆఫీస్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆడవాళ్ల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ పెట్టి వీడియోలు తీస్తున్న ఓ అటెండెంట్ బాగోతం తాజాగా బయటపడింది. వాష్‌బేసిన్ కింద పక్కాగా ఫోన్ దాచిపెట్టి దొరికిపోవడంతో ఆఫీస్‌లో పెద్ద రచ్చే జరిగింది.

TG: హైదరాబాద్ కవాడిగూడలోని పవర్ గ్రిడ్ ఆఫీస్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆడవాళ్ల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ పెట్టి వీడియోలు తీస్తున్న ఓ అటెండెంట్ బాగోతం తాజాగా బయటపడింది. వాష్‌బేసిన్ కింద పక్కాగా ఫోన్ దాచిపెట్టి దొరికిపోవడంతో ఆఫీస్‌లో పెద్ద రచ్చే జరిగింది.

టేపుతో ఫోన్ అతికించి.. దొరికిపోగానే రన్నింగ్

అక్టోబర్ 13న ఓ మహిళా ఉద్యోగిని వాష్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా.. వాష్‌బేసిన్ కింద ఏదో ఉన్నట్లు అనుమానం వచ్చింది. దగ్గరికెళ్లి చూస్తే డబుల్ సైడెడ్ టేప్‌తో అతికించి ఉన్న ఒక మొబైల్ ఫోన్ కనిపించింది. వెంటనే ఆమె ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని బయటకు వచ్చి, అక్కడే ఉన్న ఫ్లోర్ అటెండెంట్ భరత్‌ను "ఈ ఫోన్ ఎవరిది?" అని నిలదీసింది. తన నిర్వాకం బయటపడిందని తెలియగానే భరత్ ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని ఒక్కసారిగా పరుగెత్తాడు. మిగతా ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి ఆయనను పట్టుకున్నారు.

పిన్‌లాక్ పెట్టి.. ఫోన్‌ను నేలకేసి కొట్టి

అసలు ఫోన్‌లో ఏముందో చూద్దామని ఉద్యోగులు ప్రయత్నించగా, వీడియోలు ఉన్న ఫోల్డర్‌కు పిన్‌లాక్ పెట్టి ఉంది. ఇంతలోనే నిందితుడు భరత్ ఏ ఆధారాలూ దొరక్కుండా ఉండాలని ఆ ఫోన్‌ను గట్టిగా నేలకేసి కొట్టి పగలగొట్టాడు. ఈ దారుణంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో అక్టోబర్ 19న గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి భరత్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఆ ఫోన్‌లో ఇప్పటికే ఎంతమంది వీడియోలు రికార్డ్ చేశాడు? ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నాడు? అనే విషయాలు తేల్చడం కోసం కేసును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పగిలిపోయిన ఫోన్‌లోని డేటాను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

#Telangana#Telangana News#Telangana Latest News#Hyderabad#Hyderabad News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి