వైరల్ న్యూస్

జీవితంలో చదువుతో పాటు ‘క్యారెక్టర్’ ముఖ్యం: వెంకీ మామ కామెంట్స్ వైరల్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేశ్ విద్యార్థులకు, యువతకు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకకు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేశ్ విద్యార్థులకు, యువతకు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకకు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన సరదా కామెంట్స్, సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 కాలేజీ రోజులు ప్రతీ ఒక్కరి జీవితంలోనూ అత్యంత మధురమైనవని, ఆ 3-4 ఏళ్ల ప్రయాణాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని వెంకటేశ్ సూచించారు. ‘చదువుకునే రోజులు మళ్లీ మళ్లీ తిరిగిరావు. అందుకే చదువుతో పాటు కాలేజీ లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయాలి. అప్పుడప్పుడు క్లాసులు బంక్ కొట్టడం కూడా అవసరమే! నిజానికి నేను నా విద్యార్థి దశలో క్లాసులు బంక్ కొట్టడం వల్లే నా జీవితంలో, కెరీర్‌లో చాలా మంచి ఐడియాలు వచ్చాయి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వెంకీ మామ నోట ఈ మాట రావడంతో కాలేజీ మైదానమంతా విద్యార్థుల కేరింతలు, ఈలలతో హోరెత్తిపోయింది.

 కేవలం వినోదాత్మక వ్యాఖ్యలకే పరిమితం కాకుండా యువత భవిష్యత్తును ఉద్దేశించి ఒక మంచి సందేశాన్ని కూడా వెంకటేష్ ఇచ్చారు. జీవితంలో మార్కులు, డిగ్రీలు ఎంత ముఖ్యమో.. సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని(Character), క్యారెక్టర్‌ను పెంపొందించుకోవడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, మంచి ప్రవర్తన ఉన్నప్పుడే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకోగలరని విద్యార్థులకు హితవు పలికారు.

 'ఆదర్శ కుటుంబం' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వెంకీ మామ కనిపించడంతో పాటు, విద్యార్థులతో ఎంతో ఆత్మీయంగా గడిపిన దృశ్యాలు, ఆయన మాట్లాడిన వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచాయి. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వెంకటేష్ నోట వచ్చిన ఈ వ్యాఖ్యలు అటు అభిమానులను, ఇటు కాలేజీ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

#VictoryVenkatesh#AdarshaKutumbamTrailer#VenkateshMallaReddyCollege#TollywoodNewsTelugu#VenkateshFunnySpeech#CinemaNewsTelugu#VictoryVenkateshComments#TeluguFilmEvents#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి