బ్యాచిలర్ లైఫ్‌కు మరో టాలీవుడ్ హీరో గుడ్‌బై చెప్పనున్నారు.. బస్ స్టాప్, నీకు నాకు డ్యాష్ డ్యాష్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ప్రిన్స్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ఆట తీరుతో బిగ్‌బాస్ తెలుగు సీజన్1లో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ హీరో.. డైరెక్టర్ తేజ కంపౌండ్ నుంచి వచ్చారు. ఇక ప్రిన్స్ జీవితంలోకి రాబోయే హీరోయిన్ ఎవరంటే?..
ఆ అమ్మాయి సాయి మాచిరాజు.. ఈమె న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ఎన్నారై అని తెలుస్తుంది. గత నెల ప్రారంభంలో వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. కాగా రీసెంట్‌గా ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేస్తూ.. నేను కూడా ఒక ఇంటివాడిని కాబోతున్నానంటూ అఫీషియల్‌గా గుడ్ న్యూస్ చెప్పారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ లవ్ బర్డ్స్ ఆగస్టు 24న న్యూజిలాండ్‌లోనే గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు టాక్. ఇపుడు ఈ క్రేజీ అప్డేట్ బయటకు రావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్, నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు కొత్త జంటకు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు.
మరోవైపు గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక కామన్ ఫ్రెండ్ మ్యారేజ్‌లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని, తర్వాత కొద్దిరోజులకే వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారని ఈ హీరో తెలిపాడు. ఇక ప్రస్తుతం ప్రిన్స్ ఒకవైపు హీరోగా.. మరోవైపు డిఫెరెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.












