క్రైమ్

Breaking: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం!

రచన: Mamatha puppala6 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) పరిధిలో సంచలనం సృష్టించిన వేధింపుల కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తోటి మహిళా ట్రెయినీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక దాడి, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారు.

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) పరిధిలో సంచలనం సృష్టించిన వేధింపుల కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తోటి మహిళా ట్రెయినీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక దాడి, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను చికిత్స నిమిత్తం నగరంలోని ఎర్రగడ్డ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సదరు ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.
ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్‌స్టా‌గ్రామ్ స్టోరీ వైరల్!
అత్మహత్యాయత్నానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసుల వివాదంపై స్పందిస్తూ "నాపై వచ్చిన ఫిర్యాదులు, పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి. నాకు న్యాయ ప్రక్రియపై పూర్తి నమ్మకం ఉంది, చివరకు న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను. వార్తలను ప్రచురించే లేదా ప్రసారం చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని నేను మీడియాకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను." అని ఉదయ్ కృష్ణారెడ్డి రాసుకొచ్చాడు.


https://www.instagram.com/stories/udaykrishnareddy.ips/3944806978435809484?utm_source=ig_story_item_share&igsh=MWMwMjYwOXVtZjNmOA==

ఈ పోస్ట్ పెట్టిన కొద్ది గంటలకే ఆయన హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో ఉన్న తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఆయనను ఎస్సార్ నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు.
అసలు ఏం జరిగిందంటే..

తోటి బ్యాచ్‌మేట్‌పై దారుణమైన వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఇటీవలె క్రిమినల్ కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత, ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలికి నిరంతరం అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధించడమే కాకుండా, అకాడమీ ప్రాంగణంలోనే ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమి, మెడపై కత్తి పెట్టి ప్రాణాలతో చంపేస్తానని బెదిరించినట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

కేసు వివరాల ప్రకారం.. నిందితుడు అంతటితో ఆగకుండా బాధితురాలికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత (ప్రైవేట్) వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశాడు. ఆ దృశ్యాలను బాధితురాలి భర్తకు పంపించి, ఆమె కెరీర్‌ను నాశనం చేస్తానంటూ తీవ్రస్థాయిలో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణాలపై బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో, అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు కఠినమైన సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక చట్టం (IT Act) కింద కేసు నమోదు చేశారు.

పోలీసు దర్యాప్తు ముమ్మరం

ఈ సున్నితమైన ఉదంతంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేసి, ఎనిమిది రోజుల వ్యవధిలోగా ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఉదయ్ కృష్ణారెడ్డి ఈ రకమైన తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ ఆత్మహత్యాయత్నం ఘటనపై కూడా ప్రత్యేకంగా నివేదిక రూపొందిస్తున్నారు.

#TraineeIPSSuicideAttempt#UdayKrishnaReddyIPS#SVPNPAHyderabad#TraineeIPSAssaultCase#AttapurPoliceCase#IPSHarassmentCase
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి