సినిమా

14వ వసంతంలోకి మహేశ్‌ బాబు గారాలపట్టి సితార.. నమ్రత ఎమోషనల్ పోస్ట్!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతుల ముద్దుల కుమార్తె ఘట్టమనేని సితార నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటోంది. జులై 20వ తేదీన 14వ ఏట అడుగుపెట్టిన తన గారాల పట్టికి తల్లి నమ్రత సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతుల ముద్దుల కుమార్తె ఘట్టమనేని సితార నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటోంది. జులై 20వ తేదీన 14వ ఏట అడుగుపెట్టిన తన గారాల పట్టికి తల్లి నమ్రత సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన కుమార్తె అంచెలంచెలుగా ఎదుగుతుండటాన్ని కళ్లారా చూడటమే తన జీవితంలో దక్కిన అత్యంత అద్భుతమైన ఆశీర్వాదమంటూ ఆమె ఇన్స్టాగ్రామ్‌లో కాస్త భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సితారకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ పిక్‌ను నమ్రత అభిమానులతో పంచుకున్నారు. పచ్చని గార్డెన్‌లో ఒక చెట్టు నీడన బ్లాక్ కలర్ టాప్, ప్రింటెడ్ స్కర్ట్ ధరించి సితార ఎంతో స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయింది. "నా ముద్దుల బంగారానికి జన్మదిన శుభాకాంక్షలు.. మా జీవితాల్లోకి ప్రవేశించి ఇంతటి అపారమైన ప్రేమను, ఆనందాన్ని నింపినందుకు నీకు ధన్యవాదాలు. నువ్వు పెద్దదవుతుంటే చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. లవ్ యూ సో మచ్" అంటూ నమ్రత తన పోస్టులో ప్రేమను కురిపించారు.

https://www.instagram.com/p/DbAE6GrR20p/?igsh=NnY0cm1oa2F4empl
'ఎంత ఎదిగినా నా లిటిల్ స్టార్‌వే': మహేశ్ బాబు ముద్దుల వర్షం!

కుమార్తె పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం సోషల్ మీడియా వేదికగా తన పితృప్రేమను చాటుకుంటూ ఒక అద్భుతమైన పోస్ట్‌ను పంచుకున్నారు. సితారను ఎంతో అపురూపంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. "నువ్వు ఎంత పెద్దదానివైనా, నా దృష్టిలో ఎప్పటికీ నా చిన్న లిటిల్ స్టార్. హ్యాపీ 14 సితార!!! రాబోయే ఏడాది నీకు అత్యంత అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను.. లవ్ యూ ఆల్వేస్" అంటూ మహేశ్ తన హృదయపూర్వక సందేశాన్ని ఇన్స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం పడుతున్న ఈ బ్యూటిఫుల్ పిక్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండగా, అభిమానులతో పాటు సూపర్ స్టార్ కు చెందిన ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) సైతం "హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్" అంటూ కామెంట్స్ రూపంలో సితారకు శుభాకాంక్షలు తెలిపారు.
https://www.instagram.com/p/DbAMplRvj4o/?igsh=MWNwanNheWFhNjMwZA==
సితార 2012 జులై 20న జన్మించగా, అంతకుముందు 2006లో ఈ స్టార్ కపుల్‌కు గౌతమ్ కృష్ణ అనే కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో మోస్ట్ అడోరబుల్ పెయిర్‌గా నిలిచిన మహేశ్‌-నమ్రత.. 2000 సంవత్సరంలో వచ్చిన 'వంశీ' చిత్ర షూటింగ్ సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. దాదాపు ఐదేళ్ల పాటు గుట్టుగా ప్రేమాయణం సాగించిన ఈ జంట, పెద్దల అంగీకారంతో 2005 ఫిబ్రవరి 10వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

అయితే పెళ్లికి ముందే మహేశ్‌ బాబు ఒక చిన్న కండిషన్ పెట్టారని, వివాహానంతరం నమ్రత సినిమాలకు స్వస్తి చెప్పి హోమ్ మేకర్‌గా ఉండాలని కోరినట్లు గతంలో ఇంటర్వ్యూలలో వెల్లడించారు. కెరీర్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ భర్త కోరికను మన్నించి నటనకు గుడ్‌బై చెప్పిన నమ్రత, ఆ నిర్ణయం పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, తన ఫ్యామిలీ లైఫ్‌ను ఎంతగానో ఆస్వాదిస్తున్నానని స్పష్టం చేశారు. పెళ్ళికి ముందు 1993లో 'మిస్ ఇండియా యూనివర్స్'గా నిలిచిన నమ్రత.. బాలీవుడ్‌లో 'వాస్తవ్', 'పుకార్', 'కచ్చే ధాగే' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా రాణించారు.

#SitaraGhattamaneniBirthday#NamrataShirodkarPost#MaheshBabuDaughter#Sitara14thBirthday#GhattamaneniFamily#NamrataMaheshLoveStory
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి