పార్లమెంట్ మార్చ్ ఉధృతంగా సాగుతున్న వేళ ప్రముఖ విద్యావేత, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆస్పత్రి నుంచి ఓ లేఖను విడుదల చేశారు. తన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తేనే దీక్ష విరమిస్తానని లేదంటే వెనక్కి తగ్గేదిలేదని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్, విద్యావ్యవస్థలో వైఫల్యాలపై గత 20 రోజులకు పైగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్య బాగా క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన.. బెడ్ మీద నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఆయన చికిత్సలో ఉన్నందున ఆయన బాధ్యతను తాను చూస్తానని వాంగు చుక్ పేర్కొన్నారు. ఇక వాంగుచుక్ స్థానంలో తాను నిరహార దీక్షకు దిగుతున్నట్టు సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ప్రకటించారు. నేడు పార్లమెంట్ మార్చ్ ఉన్న తరుణంలో ఆయన దీక్షకు కూర్చోలేదని తెలుస్తున్నది. ఈ నిరసనల అనంతరం ఆయన దీక్ష చేపడతారని సమాచారం.
కాగా, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ ఒక లేఖను ‘ఎక్స్’ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ విడుదల చేశారు. ప్రభుత్వం,రాజకీయ పార్టీలు తన షరతులను నెరవేరిస్తే ఈరోజే దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నానని అందులో స్పష్టం చేశారు. ప్రధానంగా తన మూడు డిమాండ్లు నెరవేర్చాలని లేఖలో కోరారు. ఇటీవల జరిగిన నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీలతో సహా దేశ విద్యావ్యవస్థలో జరుగుతున్న వైఫల్యాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీల అంశాన్ని పార్లమెంట్‌లో ఖచ్చితంగా లేవనెత్తుతామని రాజకీయ నాయకులు హామీ ఇవ్వాలన్నారు.పార్లమెంట్ మార్చ్‌లో తాను పాల్గొనలేకపోతే, అగ్రశ్రేణి రాజకీయ నేతలు ఆసుపత్రికి వచ్చి పైన పేర్కొన్న షరతులపై తనకు స్వయంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ లేఖ సోనమ్ రాశాడా?లేదా వేరే ఎవరైనా రాసి ఉంటారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే నిరాహార దీక్ష కారణంగా ఆయన పూర్తిగా సిక్ అయ్యారు. బెడ్ రెస్టు మీదే ఉంటున్నారు. అలాంటప్పుడు లేఖ ఎలా రాస్తారని చర్చ జరుగుతున్నది.












