వ్యాపారం

CreditCards : క్రెడిట్ కార్డు వాడకంలో ‘జెన్ జీ’ రికార్డు..

రచన: Kumar3 నిమిషాల పఠనం

క్రెడిట్ కార్డులు వాడకంలో నేటితరం జెన్ జీలు రికార్డులు బద్దలు కొట్టారు. ఒకప్పుడు క్రెడిట్ కార్డు అంటే ఉద్యోగాలు చేసే, మంచి ఆదాయం ఉన్నవారి మాత్రమే ఆర్థిక సాధనంలా పనిచేసేంది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

క్రెడిట్ కార్డులు వాడకంలో నేటితరం జెన్ జీలు రికార్డులు బద్దలు కొట్టారు. ఒకప్పుడు క్రెడిట్ కార్డు అంటే ఉద్యోగాలు చేసే, మంచి ఆదాయం ఉన్నవారి మాత్రమే ఆర్థిక సాధనంలా పనిచేసేంది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశంలో తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారిలో సగానికి పైగా జెన్‌జీ (30 ఏళ్లలోపు యువత) ఉంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే..వారిలో సగం మంది సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడమే విశేషం.

ట్రాన్స్ ‌యూనియన్ సిబిల్ విడుదల చేసిన 'బియాండ్ ది స్వైప్ -2026' రిపోర్టు ప్రకారం..యువతలో అధికారిక రుణాల వినియోగం భారీగా పెరగడం, చిన్న పట్టణాలు కూడా క్రెడిట్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించడం దేశీయ క్రెడిట్ కార్డ్ రంగంలో కీలక మార్పులకు సంకేతమని వెల్లడించింది.ఇకపోతే 2026 మార్చి నాటికి తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారిలో 50 శాతం మంది 30 ఏళ్లలోపు వారు ఉన్నారు. నాలుగేళ్ల కిందట ఈ వాటా కేవలం 43 శాతం మాత్రమే. అదే టైంలో కొత్త కార్డ్ హోల్డర్లలో 46 శాతం మంది సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. 2022లో ఇది 42 శాతంగా ఉండేది.

క్రెడిట్ కార్డులు ఇకపై మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో భారత క్రెడిట్ కార్డ్ మార్కెట్ భారీగా విస్తరించింది. 2016లో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 1.4 కోట్లు ఉండగా, ఇది 2026 నాటికి 5.2 కోట్లకు చేరింది. అదే సమయంలో క్రెడిట్ కార్డ్ బకాయిలు(చెల్లించని బిల్లులు) కూడా భారీగా పెరిగాయి. 2016లో చెల్లించని బిల్లుల విలువ సుమారు రూ.40 వేల కోట్లు ఉండగా, ఇప్పుడు అది రూ.3.1 లక్షల కోట్లకు చేరినట్టు తెలుస్తోంది. ప్రతి కార్డు హోల్దర్ సుమారు రూ.30 వేల నుంచి 60 వేల వరకు బకాయిలు పెట్టినట్టు సమాచారం.

#creditcard#pending bills#Jen Z#using#business
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి