రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యల కారణంగా ఇటీవల భర్తలు ప్రాణాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందుకు ఒత్తిడి, అవమానించడం, అనుమానించండం, వివాహేతర సంబంధాలే మెజార్టీ కారణాలుగా నిలుస్తున్నాయి.తాజాగా ఇలాంటి ఘటనే మరోకొటి వెలుగుచూసింది. మగతనం లేదని భార్య వేధింపులు తాళలేక పెళ్లయిన మూడు నెలలకే ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యా తండాలో తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తున్న సదర్ లాల్ (27) అనే యువకుడు.. ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన మూడో రోజు నుండే మగతనం లేదని సదర్ లాల్‌ను భార్య వేధించసాగింది.
ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా అత్తగారింటికి వెళ్లగా, కుటుంబ సభ్యులతో కలిసి సదర్ లాల్‌ను భార్య అవమానించినట్టు సమాచారం.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదర్ లాల్.. అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పి, బావకు ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పి, లొకేషన్ పంపించాడు. వెంకటాయపాలెం కాలువ దగ్గరికి వెళ్లి చూడగా, అక్కడ సదర్ లాల్ బైక్, ఫోన్, కలుపు మందు డబ్బాను గుర్తించి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాలువలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.అయితే, పెళ్లికి ముందే యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని, పెళ్లయ్యాక కూడా సంబంధం కొనసాగించేందుకే సదర్ లాల్‌కు మగతనం లేదని పంచాయతీ పెట్టిందని.. మెడికల్ టెస్టులు చేయించామని సదర్ లాల్ కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












