National

CJP : పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తం.. ‘బొద్దింకల’పై లాఠీచార్జ్

రచన: Kumar3 నిమిషాల పఠనం

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పార్లమెంట్ చుట్టుపక్కల ఢిల్లీ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.సోనమ్ వాంగ్ చుక్ పార్లమెంట్ మార్చ్‌కు పిలువునివ్వడంతో సీఆర్‌‌పీఎఫ్ బలగాలు,

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పార్లమెంట్ చుట్టుపక్కల ఢిల్లీ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.సోనమ్ వాంగ్ చుక్ పార్లమెంట్ మార్చ్‌కు పిలువునివ్వడంతో సీఆర్‌‌పీఎఫ్ బలగాలు, ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయగా..కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి పలువురు నిరసనలు తెలిపేందుకు పార్లమెంట్ వద్దకు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ (Chalo Sansad) కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.లోక్‌సభ మార్చ్‌కు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు చెప్పడంతో.. నిరసనకారులు బారీకేడ్లను దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు.దీంతో అప్రమత్తం అయిన ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు సీజేపీ నిరసన కారులను అడ్డుకున్నారు.

పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త తోపులాటకు దారి తీయగా.. అప్రమత్తం అయిన పోలీసులు, ప్రత్యేక బలగాలు నిరసన కారులను అదుపు చేసేందుకు వారిపై లాఠీఛార్జ్ చేశారు.దీంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది.పోలీసులు పలువురు కీలక నిరసన కారులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.నీట్ పేపర్ లీక్ అంశంపై మొదలైన ఈ నిరసనలు ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల వేళ ఉద్రిక్తంగా మారడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది..

#parliment march#CJP#protests#arrests#lattycharge#delhi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి