ఫిఫా వరల్డ్ కప్ -2026 ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జంటీనా ఫైనల్ మ్యాచులో ఓడిపోయింది.టోర్నీ ఆరంభం నుంచి ఓటమి లేకుండా ఆడుతూ వచ్చిన స్పెయిన్ జట్టు ఫైనల్‌లో అర్జెంటీనాను ఓడించి టైటిట్ ఎగరేసుకుపోయింది. దీంతో ప్రపంచకప్ నెగ్గాలనే కోరిక మెస్సీకి కలగానే మిలిగిపోయింది. దీంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
సాకర్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఆటగాడిగా వెలుగొందిన అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సి(Messi), జాతీయ జట్టు తరఫున తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడేసి బూట్లను పక్కన పెట్టేశాడు. ఫిఫా ప్రపంచకప్- 2026 ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓడిపోవడంతో మెస్సి తన సుదీర్ఘ అంతర్జాతీయ ప్రస్థానాన్ని కన్నీళ్లతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో టైటిల్ గెలిచి ఘనంగా వీడ్కోలు పలకాలని ఆశించినా అది వీలు కాలేదు. చివరగా రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓటమి కారణంగా మైదానంలోనే తీవ్ర భావోద్వేగానికి గురైన మెస్సీ కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు.
వాస్తవానికి మెస్సి అంతర్జాతీయ కెరీర్ పదేళ్ల క్రితమే అనగా 2016లోనే ముగియాల్సి ఉంది. 2014 ప్రపంచకప్ ఫైనల్‌లో జర్మనీ చేతిలో అర్జంటీనా ఓటమి, ఆ తర్వాత 2016 కోపా అమెరికా ఫైనల్‌లో చిలీ చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో పరాజయం ఆయన్ను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. వరుసగా ఫైనల్స్ వరకు వచ్చి టైటిల్స్ ఓడిపోతుండటంతో తీవ్ర నిరాశకు గురైన మెస్సి.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ, ఆ దేశ ప్రజలు, కోట్లాది అభిమానులు, మాజీ క్రీడాకారులు, ప్రభుత్వ పెద్దలు కోరిక మేరకు మెస్సి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత మెస్సి సాధించిన విజయాలు ఆయన్ను లెజెండ్‌గా మార్చింది.












