పేదల బతుకులతో మాత్రం హైడ్రామా?
హైడ్రా అధికారుల తీరు మాములుగా లేదుగా?
కాపాడింది వివాదాస్పదమైన రూ.వేల కోట్ల భూములు.. లెక్కల్లోనే ఎక్కువ?
నోటీసులతో వాషింగ్ పౌండర్ నిర్మా మాదిరి తయారైనవి ఎన్నో?
గాజులరామారంలో పేదల ఇండ్లు కూల్చారు సరే..
కూన ఫ్యామిలీ రూ.100 కోట్ల భూ కబ్జా పట్టించుకోరా?నార్సింగ్‌లో రూ.500 కోట్ల ఎస్ఆర్ఆర్ మాఫియా బెదిరింపులకు జంకారా?
అయినా హైడ్రానే బెటర్ అంటున్న తీరుపై స్వేచ్ఛ చైర్మన్ స్టోరీ
దేవేందర్ రెడ్డి, చింతకుంట్ల,
9848070809
హై‘డర్’గా లేకపోతే మనుగడ కష్టమే?
తెలంగాణలో రియల్ మాఫియా లాబీయింగ్‌ను మించిన మాఫియా ఏదీ ఉండదు. ఎలక్షన్‌లో వెయ్యి కోట్లు అప్పటికప్పుడు ఇవ్వాలంటే వాళ్లే. ఆ తర్వాత ప్రభుత్వ భూములను కబ్జా చేసి లక్షల కోట్లు సంపాదిస్తారు. అలాంటి మాఫియాకు హైడరా భయపడుతోందని స్పష్టం అవుతోంది. రెండు వారాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. గతంలో శ్రీ ఆదిత్య, ప్రెస్టేజీ, వాసవితో పాటు పలు కంపెనీలకు వీళ్లే తిలోదకాలు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రా రియల్ పెత్తందారులు నేరుగా ఆఫీస్‌కు వచ్చి బెదిరించి వెళుతున్నారు. నార్సింగ్‌లోని ఎస్ఆర్ఆర్ రివర్ వ్యూ పేరుతో ప్రాజెక్ట్ చేపట్టిన అట్లూరి శ్రీనివాస్ రావు అనుచరులు నేరుగా హైడ్రాకు సుస్సు పోయించారు. మీరు ఏం చేయలేరు. మా వెనుక ఉన్న వారు ఎవరో తెలుసా? కోర్టుల్లో మా పలుకుబడి మీకు తెలియదు. మేము ఎలాంటి ఓసీలు లేకుండానే వెయ్యి ప్లాట్స్ అమ్మేసుకున్నాం. ఓసీ మాకు అవసరం లేకుండానే పవర్‌తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించుకుంటామని ఓ డీఎస్సీ స్థాయి అధికారిని నేరుగా భయపెట్టేందుకు చూశారు. ఒకవేళ కేసు వేసినా స్టే వస్తుంది. ఆ తర్వాత మేము చాలా పనులు చేసుకుంటామని తెలిపారు. ఎవరు ఎన్ని ఆధారాలు ఇచ్చినా ఏమీ చేయలేరు. మీకు మీరే హైడ్రా. కాని మాకు కాదు అంటూ ఓ బిల్డర్ చెప్పిన మాటలు హైడ్రాను కంగారు పెట్టించాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఎన్వోసీ ఇవ్వొద్దని హెచ్ఎండీకి ఆదేశాలు వెళ్లాయి. హైడ్రా అనుమతులు, హెచ్ఎండీఏ ఎన్వోసీ ఉంటేనే తాము క్లియరెన్స్ ఇస్తామని చెప్పించారు అంతే? ఎస్ఆర్ఆర్ రివర్ వ్యూ నార్సింగ్‌లో 13 ఎకరాలకు సరిగ్గా టైటిల్ లేకుండానే నిర్మాణాలు చేపట్టింది. అందులో 6 వేల గజాల పార్క్ ప్లేస్, 12 వేల గజాల రోడ్లను కబ్జా చేసింది. అనుమతి కోసం ఆనాటి డైరెక్టర్ బాలకృష్ణకు రూ.10 కోట్లు ముట్టజెప్పారు. రూ.9 కోట్లు అరవింద్ కుమార్‌కు చేరవేశారు. అంతా ఆయన ఏసీబీ కన్ఫెషన్ రిపోర్టులో పొందుపర్చినా, హైడ్రా పార్క్ ప్లేస్ ని కాపాడలేకపోతోంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ వ్యవహరంపై ఓ ఎన్ఆర్ఐ(రవి) ఫైటింగ్‌పై కథనాలు వచ్చాయి.
గాజులరామారంలో పేదల రెక్వెస్ట్
హైడ్రా అనగానే గాజులరామారంలో పేదల ఇళ్లను నిత్యం కూల్చివేసే ఘటనలే గుర్తుకు వస్తాయి. వేల కుటుంబాలను రోడ్డున పాలు చేసినందుకు అక్కడివారు శాపనార్ధాలు పెట్టారు. కాని అదే గ్రామంలో కూన వెంకటేష్ కుటుంబం 7 ఎకరాల భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి ఒక్కొక్క ఫంక్షన్‌కు రూ.6 లక్షలు ప్రభుత్వ భూమిలో సంపాదిస్తోంది. దీన్ని కాపాడి పేదలు నివాసం ఉండే ఈ ఏరియాలో మంచి కమ్యూనిటీ హాల్ , రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించాలని జనం వేడుకుంటున్నారు. మీకు సర్వే నెంబర్ 11, 12, 13, 127లోని కబ్జాలు ఎందుకు కనపడడం లేదని ప్రశ్నిస్తున్నారు. మామూళ్ల మత్తులో మీ లోకల్ ఇన్‌స్పెక్టర్ మీకు సమాచారం ఇవ్వడం లేదా? ఇక్కడ మంచి పేరు మీకు వస్తే ప్రజా పాలనకు పేరొస్తుందని చెప్పడం లేదా? ఎందుకు ఈ కూన కుటుంబానికి అండగా ఉంటూ ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతున్నారు. పేదల ఇళ్లను కూల్చిన మీరు ఓపెన్ స్పేస్‌లో పహారీ గోడను కూల్చివేసి స్వాధీనం చేసుకోలేరా అంటూ కాలనీ వాసులు హైడ్రాకు పిర్యాదులు చేశారు. కాని ఇప్పటికి పట్టించుకోలేదు. స్థానిక బీజేపీ నేతలు ప్రజావాణిలో ఫిర్యాదులు చేసి హైడ్రా అందరికీ సమానమేనా కాదా అనేది తెలిసిపోతుందని భావిస్తున్నారు.
హైడ్రా చేసిన ఘనత ఇదే?
ఇప్పటివరకు 1,381 అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. రూ.లక్ష 50 వేల కోట్ల విలువ అయినా భూములను కాపాడింది. 1,850 ఎకరాల ప్రభుత్వ భూమి, 454 ఎకరాల చెరువు భూములు, 96 ఎకరాల పార్క్ ప్లేస్‌లు , 62 ఎకరాల ఫుట్ పాత్‌లు, 25 ఎకరాల నాలా ఆక్రమణలు తొలగించింది. మొత్తం 2,500 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చేసింది. 14 చెరువులను అభివృద్ది చేసింది. అయితే హైడ్రాకు ఉన్న పవర్‌తో పైసలను క్యాచ్ చేసుకుంటున్న బ్యాచ్ కూడా భారీగానే పెరుగుతోంది. కింది స్థాయి సిబ్బందిపై అనేక అరోపణలు వస్తున్నాయి. హైడ్రా అధికారులు డబ్బులు అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఇళ్ల నిర్మాణం చేసుకున్న వారిపై హైడ్రా టీడీఆర్ ప్రయోగిస్తోంది. అలా అందరికీ వర్తించేలా చేయాలి. కాని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల జోలికి వెళ్లకుండా ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఎదిఏమైనా హైడ్రా ఈజ్ వెరీ గ్రేట్ బట్ నాట్ ఫెయిర్ అని అర్థమవుతోంది.












