క్రీడలు

FIFA WC-2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్.. మెస్సీ సేనకు షాక్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఫిఫా 2026 ఫైనల్ పోరులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. న్యూయార్క్ న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో అర్జెంటినాపై స్పెయిన్ విశ్వవిజేతగా రికార్డు సృష్టించింది.

 ఫిఫా 2026 ఫైనల్ పోరులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. న్యూయార్క్ న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో అర్జెంటినాపై స్పెయిన్ విశ్వవిజేతగా రికార్డు సృష్టించింది. 1-0 తేడాతో అర్జెంటీనాపై స్పెయిన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయంతో స్పెయిన్ తన 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ (2010 తర్వాత) రెండోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. మరోవైపు, టైటిల్‌ను నిలబెట్టుకోవాలని, నాలుగోసారి కప్‌ గెలవాలని బరిలోకి దిగిన మెస్సీ సైన్యానికి రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు.

మ్యాచ్ ప్రారంభమైన నిర్ణీత 90 నిమిషాల వరకు ఇరు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు తలపడినప్పటికీ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో విజేతను తేల్చడానికి మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఈ క్రమంలోనే స్పెయిన్ శిబిరంలో వ్యూహాత్మక మార్పు జరిగింది. సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన ఫెర్రాన్ టోర్రెస్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తూ స్పెయిన్‌కు ఊహించని విజయాన్ని అందించాడు.

మ్యాచ్ 106వ నిమిషంలో నికో విలియమ్స్ హెడర్ ద్వారా అందించిన అద్భుతమైన పాస్‌ను టోర్రెస్ అందుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఎడమ కాలితో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్‌ను చాకచక్యంగా ఏమారుస్తూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఈ ఏకైక మెరుపు గోల్‌తో స్పెయిన్ సంబరాలు మిన్నంటాయి. ఆ తర్వాత స్పెయిన్ మరో గోల్ చేసినప్పటికీ, ఫౌల్ కారణంగా అంపైర్ దాన్ని తిరస్కరించారు.

ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి స్పెయిన్ డిఫెండర్లు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని పూర్తిగా కట్టడి చేశారు. దీనికి తోడు, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ పొంది మైదానాన్ని వీడటంతో ఆ జట్టు 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. లూయిస్ డి లా ఫ్యూయెంటె మార్గదర్శకత్వంలోని స్పెయిన్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయ ఛాంపియన్‌గా నిలవగా, టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న మెస్సీ కల నిరాశగానే మిగిలిపోయింది.

https://x.com/FIFAWorldCup/status/2079003533722960323?s=20

 

#SpainWinsFIFA2026#FerranTorresGoal#SpainVsArgentinaFinal#FIFAPhoneWorldCup2026#FootballNewChampions#LionelMessiDisappointment
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి