తెలంగాణ

Telangana: ఇందిరమ్మ ఇళ్లు మీకు రావాలంటే ఇలా చేయండి!..

రచన: Venu5 నిమిషాల పఠనం

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని హైదరాబాద్‌లోని అల్పాదాయ వర్గాల కుటుంబాలకు విస్తరిస్తూ, క్యూర్ (CUR) పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. కాగా ప్రస్తుతం అదే కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని అల్పాదాయ వర్గాల కుటుంబాలకు విస్తరిస్తూ, క్యూర్ (CUR) పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, ఇతర మార్గదర్శకాలతో కూడిన అధికారిక బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ప్రతి వారికి సొంతింటి కల ఉంటుంది. అలాంటి వారి కలలను నిజం చేస్తూ.. పేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. కాగా సొంత స్థలం ఉన్న వారికి మొత్తం 4.5 లక్షల ఇళ్లను మొదటి విడతలో భాగంగా మంజూరు చేశామని.. ఆగస్టు నాటికి 2 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి కానున్నట్టు పేర్కొన్నారు.

ఇక రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్టు వివరించారు. మరోవైపు ఇప్పటివరకు ఇళ్ల స్థలం లేని నిరుపేదల కోసం క్యూర్ ప్రాంతంలో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష, స్వార్థం లేకుండా పూర్తి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు అందేలా ప్రభుత్వ స్థలంలోనే ఈ ఇళ్లను నిర్మించి ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.

రాష్ట్రంలోని 26 నియోజక వర్గాలల్లో 500 ఇళ్లను అపార్ట్‌మెంట్ తరహాలో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఒక్కో ఫ్లాట్ 500 చదరపు అడుగుల వైశాల్యంలో, అన్ని వసతులతో ఉంటుందని వెల్లడించారు. కాగా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.11లక్షలు ఖర్చు అవుతుందని.. కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందని.. మిగతా రూ.6లక్షలు 4విడతల్లో లబ్ధిదారులు చెల్లించాలని మంత్రి వివరించారు.

ఇక ఏడాది రూ. 6 లక్షలుఆదాయం ఉండి, సొంత ఇల్లు, స్థలం లేని వారు ఈ స్కీమ్ కు అర్హులని తెలిపిన పొంగులేటి.. ఈ ఇళ్ల కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10 వరకు అవకాశం ఉందన్నారు. అలాగే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు ఫారమ్‌ను ప్రజా పాలన కేంద్రాల్లో లేదా మీసేవ కేంద్రాల ద్వారా నింపి సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. లేదా మీసేవా ద్వారా కూడా రూ.100 చెల్లించి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు..

మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకోసం దళారుల మాయమాటలకు మోసపోవద్దని.. ఎవ్వరికీ ఒక్క పైసా కూడా ఇవ్వ వలసిన అవసరం లేదని మంత్రి తెలిపారు. అలాగే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు..

#telangana#hyderabad#indiramma houses#ministers#application
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి