వైరల్ న్యూస్

Zipline Ride: బాబోయ్.. ప్రాణాల మీదకు తెచ్చిన జిప్‌లైన్ రైడ్.. 40అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన టూరిస్ట్

రచన: NK4 నిమిషాల పఠనం

కర్నాటకలోని రిసార్ట్ లో ఘోరం జరిగింది. జిప్ లైన్ రైడ్ సేఫ్టీ లాక్ ఫెయిల్ కావడంతో 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

Zipline Ride: జిప్ లైన్ రైడ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కొత్త అనుభూతిని ఇస్తుంది. టూరిస్ట్ ప్లేసుల్లో జిప్ లైన్ రైడ్ కామన్ గా చూస్తుంటా. ఆ రైడ్ చేసి అందులోని థ్రిల్ ని ఆస్వాదించాలని అనుకుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో జిప్ లైన్ రైడ్స్ ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నాయి. ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు ఎత్తు నుంచి కింద పడి గాయాలపాలైవుతుంటే, మరికొన్ని సార్లు ఏకంగా ప్రాణాలే పోతున్నాయి.

తాజాగా కర్నాటకలోని రిసార్ట్ లో ఘోరం జరిగింది. జిప్ లైన్ రైడ్ సేఫ్టీ లాక్ ఫెయిల్ కావడంతో 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దండేలిలోని ఒక రిసార్ట్‌లో జిప్‌లైన్ రైడ్ చేస్తుండగా జిప్ లైన్ విఫలమవడంతో అతను దాదాపు 40 అడుగుల లోతుకు పడిపోయాడు. విజయపురకు చెందిన కుబేర్ సుర్‌పూర్ చేతులు, కాళ్లకు తీవ్రమైన ఫ్రాక్చర్లు అవ్వడంతో పాటు నరాలకు కూడా దెబ్బ తగిలింది. కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సాహస పర్యాటక కేంద్రాలలో భద్రతా ప్రమాణాలపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కుబేర్ గాలిలో వేలాడుతుండగా జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఊడిపోవడంతో అతను కింద పడిపోయాడు. పరికరాలు తుప్పు పట్టి, సరైన నిర్వహణ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. కుబేర్‌ను మొదట దండేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత విజయపురలోని ఆసుపత్రికి మార్చారు. అతని ఆరోగ్య పరిస్థితికి ప్రత్యేక వైద్యం అవసరం కావడంతో తదుపరి చికిత్స కోసం మిరాజ్‌కు తరలించారు.

సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. దీనికి రిసార్ట్ యాజమాన్యం జవాబుదారీతనం వహించాలని బాధితుడి కుటుంబం డిమాండ్ చేసింది. కాగా, ఈ సంఘటన ఆన్‌లైన్‌లో తీవ్రమైన ఆందోళనను రేకెత్తించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి, సాహస క్రీడల సౌకర్యాలపై కఠినమైన తనిఖీలు చేయాలని, పరికరాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

"ఇది చాలా దారుణమైన జిప్‌లైన్ డిజైన్. అతను తాడును వదిలేసినా కింద పడకుండా ఉండేలా బెల్టులు అతని శరీరానికి అతుక్కుని ఉండాలి. అసలు ఇలాంటి దానికి ఎలా అనుమతి ఇచ్చారు?!" అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..

https://x.com/ViralDecoder/status/2078867322413212130

#Zipline Ride#Zipline Safety Lock#Karnataka#Resort#Dandeli
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి