Tollywood: సినిమా సక్సెస్ కి ప్రధాన కారణాలు ఏంటీ.? అని గనక డిబేట్ పెడితే..రక రకాల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అభిమానులను అడిగితే 'హీరో' అంటారు. నిర్మాతలను అడిగితే కొందరు 'హీరో' అంటారు..కొందరు 'కథ' అంటారు. ఇక్కడ కూడా ఓ లెక్క ఉంది. హీరోను నమ్మి సినిమా తీసే నిర్మాతే హీరో అని చెప్పేది. కానీ, కథను నమ్మి తీసే నిర్మాత ఎప్పుడు కూడా కథే హీరో అంటాడు. కామన్ ఆడియన్స్ కూడా చెప్పేది ఇదే. ఫైనల్గా సినిమా హిట్ అవ్వాలంటే కావాల్సింది 'కథ'.
కథ బావుంటుంటే అందులో హీరో పాత్ర బలంగా ఉంటుంది. మిగతా పాత్రలు అంతే లేదా అంతకన్నా బలంగా ఉంటాయి. కథ బాగోలేకపోయినా హీరో మీదే భారం వేసి లాగించేద్దామనుకుంటే అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోరు. ఈ మధ్య కాలంలో కథ లేకుండా హీరో ఇమేజ్ మీద సినిమాలు తీస్తే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డవి చాలానే ఉన్నాయి. ఇది, ఏ ఒక్క హీరో గురించో చెప్పే మాట కాదు.
క్లియర్గా చెప్పాలంటే, ఇటీవల కాలంలో వచ్చిన రవితేజ సినిమాలలో బలమైన కథ లేకుండా మాస్ మహారాజ్ ఇమేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని తీసిన సినిమాలన్నీ ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. అదే, రవితేజ..బలమైన కథ-కథనాలతో హ్యూమన్ ఎమోషన్స్తో చేసిన ఇరుముడి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక్కడ కథ మాత్రమే సక్సెస్ సాధించింది. అందులో నటించిన నటీనటులు సినిమాకి అదనపు ఆకర్శణగా నిలిచారు. మనసులను హత్తుకున్న కథలెప్పుడు నిలబడతాయి.
ఫ్యామిలీ ఆడియన్స్:
ఎప్పుడైతే కథ కుటుంబమంతా చూడగిలిగేలా ఉంటుందో అప్పుడు ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది. మన శంకరవరప్రసాద్గారు దీనికి ఉదాహరణ. అలాగే, సామాజిక అంశాలతో..మంచి కామెడీతో ప్రేక్షకులను నవ్వించగలిగితే, ఆ సినిమా కూడా సూపర్ హిట్టే. కానీ, భారీ తారాగణం..ఫైట్స్..వీఎఫ్ఎక్స్..గ్రాఫిక్స్..ఛేజింగ్స్..ఇలా కథను నడిపించలేని ఏ హీరో సినిమా అయినా ఇట్టే బోల్తా పడుతుంది. కంటెంట్ మాత్రమే ఇక్కడ సినిమాను నిలబెడుతుంది.
లెనిన్-రణబాలి:
లెనిన్, ఇరుముడి సినిమాలు రెండు కూడా కథ బలంగా ఉండే హిట్ కొట్టాయి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిన రణబాలి సినిమా కూడా బలమైన కథ-కథనాలతో రూపొందుతోంది. అఖిల్, రవితేజలకి హిట్ దక్కిందంటే, అది కథ వల్లే అని ఎలాంటి సీనియర్ రివ్యూవర్ అయినా ఒప్పుకోవాల్సిందే. రణబాలి సినిమాలో విజయ్ దేవరకొండ గత సినిమాల ప్రభావం పడకుండా ఉండాలంటే ఇలా కథ బలమైనదిగా ఉండాలి. లేదంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


