South Cinema: సినిమా బావుందంటే థియేటర్స్‌కి పరుగెత్తుకెళతారు ఆడియన్స్. అది, ఎప్పుడూ ప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఎన్ని ఓటీటీలు వచ్చినా, ఎలాంటి ప్యాండమిక్ సిచ్యువేషన్స్ ఎదురైనా..ఆడియన్ కోరుకున్న ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగితే థియేటర్స్ ఎక్స్పీరియన్స్ కోసమే వస్తాడు. ఇందుకు ఉదాహరణ ఈ మధ్య కాలంలో వచ్చిన బ్లాక్ బస్టర్స్ మా ఇంటి బంగారం, లెనిన్, కొరియన్ కనకరాజు, మన శంకరవరప్రసాద్‌గారు, ఇరుముడి లాంటి హిట్ సినిమాలే.
ఎవరు ఈ సినిమాలు చూడకుండా ప్రేక్షకులను థియేటర్స్‌కి రాకుండా ఆపగలిగింది. ఇక్కడ, కథ.. హీరో ఇమేజ్ మాత్రమే సినిమాను నిలబెడతాయి. ఒకవేళ కథ వీక్‌గా ఉన్నా, హీరో ఫుల్ ఫాంలో ఉన్నా కూడా ఆ సినిమాల లెక్కలు బాక్సాఫీస్ వద్ద తేడాగా వస్తాయి. ఈ మధ్య కాలంలో ఆడియన్స్‌ను మాయ చేయడానికి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తప్పుడు కలెక్షన్స్‌తో పోస్టర్స్ వేసి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
కానీ, ఇలాంటి జిమ్మిక్కులు, మ్యాజిక్కులు ఒకప్పుడు. సోషల్ మీడియా ప్రభావం లేనప్పుడు ఇలాంటివన్నీ పనిచేశాయి. ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ ..పోస్టర్స్ వచ్చేవి కాదు. విజయవంతమైన 10వ రోజు పోస్టర్ దగ్గర్నుంచి 125వ రోజు..150వ రోజు..250వ రోజు అని పోస్టర్స్ చూసేవాళ్ళం. ఎన్ని ప్రాంతాలలో 100 రోజులు ఆడిందో చూసేవాళ్ళం.
కానీ, ఇప్పుడు అంతా మాయ. సోషల్ మీడియలో డే 1 కలెక్షన్స్ ఇన్ని కోట్లు అని పోస్టర్స్ వేస్తున్నారు. దీని వల్ల కొన్ని సార్లు తప్పుడు కలెక్షన్స్ అని ఇట్టే తెలిసిపోతుంది. ఆడియన్స్ కి సినిమా నచ్చితే ఏ పోస్టర్ కూడా అవసరం లేదు. వాళ్ళే ఒకరికొకరు చెప్పుకొని థియేటర్స్‌కి వస్తారు. సినిమా రిలీజైనప్పుడు 100 కోట్లు అని చెప్పుకున్న నిర్మాత, నెమ్మదిగా అసలు ఎంత లాసో కక్కేస్తాడు. కొన్ని సినిమాల విషయంలో ఈ మధ్య జరిగిందిదే. కాబట్టి, ఫేక్ కలెక్షన్స్ ఎప్పుడూ ఫేకే తప్ప సినిమాను లాభాల పట్టించవు.


