తెలంగాణ

22ఏ ను అడ్డు పెట్టుకుని భూ అక్రమాలకు పాల్పడుతున్నారు- ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రచన: NK•••4 నిమిషాల పఠనం

22ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. 22ఏ ను అడ్డు పెట్టుకుని భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 22ఏ నిషేధిత భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు.

22A Lands: 22ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. 22ఏ ను అడ్డు పెట్టుకుని భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 22ఏ నిషేధిత భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత భూముల జాబితాపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు.

ధరణి పేరుతో బీఆర్ఎస్, భూభారతితో పేరుతో కాంగ్రెస్ భూదోపిడీ

ధరణి పేరుతో నాడు బీఆర్ఎస్, భూభారతితో పేరుతో నేడు కాంగ్రెస్ భూ దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. ధరణి నుంచి భూభారతి వరకు అవే అక్రమాలు జరిగాయన్నారు. ప్రభుత్వ, పేదల భూములను బడా నేతలు ఆక్రమిస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 22ఏ అనేది రాజ్యాంగ విరుద్ధమని గతంలోనే కోర్టు కొట్టివేసిందని ఆయన గుర్తు చేశారు. కొన్ని సవరణలు చేసి ప్రభుత్వాలు దానిని అలాగే కొనసాగిస్తున్నాయన్నారు.

24లక్షల ఎకరాల అటవీ భూములు ఏమయ్యాయి?

''అటవీ భూములు వాస్తవంగా 66 లక్షల 33వేల 313 ఎకరాలు. అటవీ భూములు 42.53 లక్షల ఎకరాలు మాత్రమే అని పొంగులేటి అన్నారు. దాదాపు 24 లక్షల ఎకరాల అటవీ భూములు ఏమయ్యాయో చెప్పాలి. బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశం ఇవ్వడం లేదు? అసైన్డ్ భూములు అమ్ముకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది'' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

లక్షల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు

''బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణిలో లోపాలు ఉన్నాయని, లక్షల కోట్ల దోపిడీ జరిగిందని అన్నారు. మరి అధికారంలోకి వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన దారుణాలను ఒక్కొక్కటిగా బీజేపీ బయటపెడుతుంది. ఏ విధంగా రెండు ప్రభుత్వాలు దోపిడీ చేశాయో, ఏ రకంగా రాష్ట్రాన్ని దివాళా తీయించాయో, లక్షల కోట్ల విలువైన భూములను ఏ విధంగా కొల్లగొట్టారో ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకెళ్తాం.

దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం

ఇది సామాన్యమైన దోపిడీ కాదు. దేశంలోనే అతిపెద్ద భూ కంభకోణం. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొల్లగొట్టింది గత ప్రభుత్వం, వారితో లాలూచీ పడి ఈ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వం లానే ఈ ప్రభుత్వం కూడా లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్ వేస్తోంది. మంత్రులే స్వయంగా ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు'' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

#22A Lands#22A Land Scam#22A Prohibited Lands#Telangana Bjp#Alleti Maheshwar Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి