క్రైమ్

HCA: బ్లాక్‌లో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు అరెస్ట్

రచన: NK••4 నిమిషాల పఠనం

క్రికెట్ కున్న క్రేజ్ ను సొమ్ము చేసుకోవాలని చూశారు. కాసుల కక్కుర్తితో దిగజారిపోయారు. కాంప్లిమెంటరీ టికెట్లను సైతం అక్రమంగా బ్లాక్ లో విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. కట్ చేస్తే.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి పరువు పొగొట్టుకున్నారు. హైదరాబాద్ లో భారత్‌-వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌ టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ దందా బట్టబయలైంది.

HCA: క్రికెట్ కున్న క్రేజ్ ను సొమ్ము చేసుకోవాలని చూశారు. కాసుల కక్కుర్తితో దిగజారిపోయారు. కాంప్లిమెంటరీ టికెట్లను సైతం అక్రమంగా బ్లాక్ లో విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. కట్ చేస్తే.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి పరువు పొగొట్టుకున్నారు. హైదరాబాద్ లో భారత్‌-వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌ టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ దందా బట్టబయలైంది.

గోషామహల్ పోలీసులు మెరుపు దాడి చేసి కాంప్లిమెంటరీ టికెట్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ్‌, ఆయన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవ్‌ ఉండటం అందరినీ షాక్ కి గురి చేసింది. వీరితో పాటు అవినాష్ దరక్‌, మోహిత్ సోమానీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

తన తండ్రి, హెచ్‌సీఏ సభ్యుడిగా ఉన్న సతీష్ చంద్ర శ్రీవాస్తవ్‌ ద్వారా ఆయన కొడుకు ఆకర్షిత్ ‘నాట్ ఫర్ సేల్’ కాంప్లిమెంటరీ టికెట్లను పొందాడు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ స్టేటస్‌ల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగి ముఠా గుట్టు రట్టు చేశారు. క్రికెట్ లవర్స్ లో భారత్-విండీస్ టీ20 మ్యాచ్‌ కున్న క్రేజ్ ను ఆసరాగా చేసుకుని ఈ బ్లాక్ దందాకు తెరలేపారు నిందితులు.

బేగంబజార్‌లోని ఎస్‌డీ మాల్‌ సమీపంలో టికెట్లు అమ్ముతున్న సమయంలో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 11 మ్యాచ్‌ టికెట్లు, 8 దాండియా పాస్‌లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ స్కూటర్‌ను సీజ్ చేశారు. కాంప్లిమెంటరీ పాస్‌లను హెచ్ సీఏ సభ్యుడు, ఆయన కొడుకు కలిసి బ్లాక్‌లో విక్రయించిన వైనం హెచ్ సీఏలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

#HCA#Hyderabad Cricket Association#Black Market#Sale#T20 Tickets#Ind Vs WI#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి