సినిమా

Tollywood: సినిమాపై ఓటీటీ ఒత్తిడెందుకు?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Tollywood: ఒకప్పుడు సినిమా ఎప్పుడు మొదలైనా, ఎప్పుడు పూర్తైనా ఆ సినిమాలపై నిర్మాతల ఒత్తిడి ఉండేది. ఒకవేళ సినిమా అవుట్ పుట్ కోసం గనక రీ షెడ్యూల్స్, ఎక్స్ట్రా డేస్ షూట్ అన్నా కూడా ఇబ్బందులు ఉండేవి కాదు. ఎందుకంటే, కొన్ని సినిమాలకి ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించి, దాని ప్రకారమే షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి చేసేవారు. కానీ, ఇప్పుడు ఇదే సినిమా మీద ఓటీటీల ఒత్తిడి ఎక్కువై, నిర్మాతలకి లాస్ తప్పడం లేదు.

గతంలో పోల్చుకుంటే వ్యాపారం పరంగా సినిమాపై చాలా మంది ఆధిపథ్యం సాగుతోంది. ముఖ్యంగా, ఓటీటీలతో డీల్ కుదుర్చుకున్న తర్వాత వారితో అగ్రిమెంట్ చేసుకున్న తేదీకే సినిమాను రిలీజ్ చెయ్యాలి. ఇక్కడ, సినిమాకి వచ్చిన వసూళ్ళను బట్టి ఓటీటీ డీల్ లో కొన్ని మార్పులు కూడా జరగవచ్చు. అంతేకాదు, చిన్న సినిమాలు కొన్నిటికి తక్కువ ఆఫర్ చేస్తే వాళ్ళు ఒప్పుకోకుండా సినిమాపై ఉన్న నమ్మకంతో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటే..అదే ఓటీటీ తగ్గి మేకర్స్ అడిగినంత ముట్టచెప్తున్నారు. ఇటీవల ఓ సినిమాకి ముందు ఓటీటీ బిజినెస్ విషయంలో ఇలాంటి చర్చలే జరిగాయి. తక్కువ అమౌంట్ ఇస్తామని సదురు ఓటీటీ వారు తేల్చి చెప్పారట. కానీ, ఆ డీల్ కి ఒప్పుకోకుండా మేకర్స్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఆ సినిమా భారీ హిట్ సాధించింది. దాంతో, దాదాపు 40 కోట్ల వరకూ డీల్ కుదుర్చుకున్నారు. అదే, డీల్ ముందు గనక ఐతే 10 నుంచి 12 కోట్ల వరకే మేకర్స్ అందుకునేవారు.

కానీ, ఇది అన్నీ సినిమాలకి జరగుతుందనుకుంటే పొరపాటే. పెద్ద సినిమాలకి మాత్రం ఓటీటీలు గట్టిగా టార్గెట్ పెడుతున్నాయి. అలాంటి, సమయంలో ముందు కుదుర్చుకున్న డీల్ లో మార్పులు జరిగి..కోత పడుతోంది. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా డిసెంబర్ 3న రిలీజ్ చేయాలి. కానీ, ఆ డేట్ మారడంతో, డీల్ కుదుర్చుకున్న ఓటీటీ ముందు అనుకున్న మొత్తంలో కొంత శాతం కోత విధించిందట.

వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం విడుదలకి కూడా ఓటీటీ వల్ల వచ్చిన సమస్యలే అని సమాచారం. విడుదల తేదీ మారడంతో ఓటీటీ నుంచి ముందు కుదుర్చుకున్న ఒప్పందం కంటే దాదాపు, 20 శాతం కోత పడినట్టుగా తెలుస్తోంది. ఈ సెటిల్‌మెంట్ ఇంకా కొలిక్కి రాకపోవడం వల్లే ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్‌ను ప్రకటించడం లేదట. దీని, వల్ల నిర్మాతలకి నష్టాలు కూడా తప్పడం లేదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

#Tollywood#OTT platforms#Fauzi#Prabhas#Aadarsha Kutumbam#Venkatesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి