సినిమా

Cinema: బోల్డ్ పాత్రలు చేసిన హీరోయిన్స్ అలాంటి వాళ్ళేనా?

రచన: Anshu••6 నిమిషాల పఠనం

Cinema: సాధారణంగా సినిమాపై సమాజం ప్రభావం..సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఆదర్శ వంతమైన సంఘటనలు, మనుషుల జీవితాలు..వీటి ఆధారంగా కథలు తయారవుతున్నాయి. ఆ కథల్లో హీరోలు నటిస్తుండటం జరుగుతోంది. ఇలా, తయారైన కథలే బయోపిక్స్‌గా రూపొంది బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన సినిమా ది దర్టీ పిక్చర్. ఇప్పుడు, దీనికి సీక్వెల్ సినిమాను రూపొందించే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. లీడ్ రోల్ కోసం తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే బోల్డ్ రోల్స్:

బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే కొందరు హీరోయిన్స్ బోల్ట్ పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని ఒక దశలో స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ సంపాదించారు. ఆ తర్వాత, సిల్క్ స్మిత ఒక ఊపు ఊపేసింది. వీరు డాన్స్ చేసిన పాటలకి ఐటం సాంగ్ అని, చేసిన డీగ్లామర్ రోల్స్‌కి వ్యాంప్ క్యారెక్టర్స్ అని పేరు పెట్టారు. పోస్టర్ మీద సిల్క్ స్మిత కనిపిస్తే ఆ సినిమాకి జనాలు క్యూ కట్టేవారు. అంతగా వీరి ప్రభావం ఉండేది.

సిల్క్ స్మిత అయితే, ఎంత పెద్ద హీరో ఎదురుగా ఉన్నా కనీసం నిలుచొని హలో చెప్పేది కాదట. చాలా తక్కువ మందితోనే సన్నిహితంగా ఉండేదని ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఇచ్చిన అప్పటి సినీ తారల మాటల్లో అర్థమైంది. కానీ, వీరు చేసిన వ్యాప్ పాత్రల ప్రభావం వల్ల చాలా వరకూ సమాజంలో మహిళల పట్ల, వారి ప్రవర్తనల పట్ల తీవ్ర అవమానానికి గురైయ్యారు. సినిమాలో కనిపించినట్టుగానే బయట కూడా ఉంటారని తిట్టిన వాళ్ళు లేకపోలేదు.

Cinema: బోల్డ్ పాత్రలు చేసిన హీరోయిన్స్ అలాంటి వాళ్ళేనా?

అలాంటి, ప్రతిభావంతురాలైన పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించి మెప్పించింది. అసలు, ఇలాంటి పాత్రను అప్పట్లో విద్యాబాలన్ ఒప్పుకుంటుందని ఎవరూ ఊహించినలేదు. అసలు, ఈ సినిమాలో ఆమె నటన చూసి ఒక్కొక్కరికి పిచ్చెక్కింది. అంతగా లీనమైపోయింది బాలన్. 2011లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. అయితే, ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని తాజాగా, ఏక్తా కపూర్ వెల్లడించడం మరో హాట్ టాపిక్. అంతేకాదు, మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సీక్వెల్‌లో నటించనుందన్న వార్త అంతటా వైరల్ అవుతోంది. లస్ట్ స్టోరీస్‌లో తమన్నా హీటెక్కించే పర్మార్ఫెన్స్ కి ఎంతోమందికి చమటలు పట్టాయి. అందుకే, డర్టీ పిక్చర్ 2 కోసం ఆమె పేరు వినపడగానే ఫ్యాన్స్ మేఘాల్లో తేలిపోతున్నారు.

ఇదంతా, ఒకెత్తైతే..ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ చేస్తున్న హీరోయిన్స్ గురించి బయట రక రకాల అభిప్రాయాలను పెట్టుకుంటున్నారు. డబ్బు కోసం ఎంతపనైనా చేస్తారని ఎవరికి వారు నిర్ణయించుకొని చాలా చీప్‌గా మాట్లాడుతున్నారు. సినిమాలో ఓ పాత్ర చేసినంత మాత్రాన చాలా చులకనగా, అసహ్యంగా మాట్లాడటం వారి వృత్తిని ఘోరంగా అవమానించడమే. దీన్ని ఆధారంగా చేసుకొనే ఈ మధ్య ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ ద్వారా న్యూడ్, సెమీ న్యూడ్ ఫొటోలను, వీడియోలను చేసి తీవ్రంగా అవమానిస్తున్నారు. కళా కారులను గౌరవించాలి..ఆదరించాలి. కానీ, కొందరు మాత్రం ప్రాణాలు తోడేసేంతగా కామెట్లతో, పోస్టులతో చంపేస్తున్నారు.

#South Actress#Silk Smitha#Jyothi Laxmi#Jayamalini#Vidhyabalan#Tamannah
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి