Trade Deal: భారత్, అమెరికాల మధ్య ఎప్పటినుంచో నడుస్తున్న మెగా బిజినెస్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య కుదరాల్సిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో మొదటి రౌండ్ చర్చలు పూర్తయ్యాయని, తొలి దశ ప్రాసెస్ దాదాపు కొలిక్కి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడిన గోయల్.. ఈ డీల్‌కు సంబంధించి ప్రస్తుతం లీగల్ డ్రాఫ్ట్ రెడీ అవుతోందని చెప్పారు.
సంతకాలు ఎప్పుడంటే..
మొదటి దశ పూర్తయి లీగల్ పేపర్స్ రెడీ అవుతున్నప్పటికీ, ఈ డీల్‌పై తుది సంతకాలు జరగడానికి ఒక ముఖ్యమైన విషయం తేలాల్సి ఉంది. దీనిపై వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. అమెరికా విధించే టారిఫ్‌లు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అఫిషియల్‌గా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. యూఎస్ వైపు నుంచి దిగుమతి సుంకాలపై ఒక స్పష్టమైన నిర్ణయం రాగానే, ఏమాత్రం లేట్ చేయకుండా రెండు దేశాలు ఈ అగ్రిమెంట్‌పై సంతకాలు చేయనున్నాయి. ఈ డీల్ ఓకే అయితే భారత్, అమెరికా మధ్య వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకోవడమే కాకుండా మన దేశీయ ఎగుమతులకు భారీ ఊరట లభించనుంది.


