సినిమా

Aafiya Syed: "అలియాస్ రుక్మిణి" టైటిల్ కి తగ్గ హీరోయిన్ కాదేమో?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Aafiya Syed: కొన్ని సినిమాలకి టైటిల్ ఎంత ముఖ్యమో, అందుకు తగ్గ హీరో లేదా హీరోయిన్ సెలక్షన్ కూడా అంతే ముఖ్యం. కాస్టింగ్ ఫెయిల్యూర్ సినిమాలు చాలా ఉన్నాయి. కథ, కథనం, డైరెక్షన్..ఇలా అన్నీ బావున్నా కూడా, కేవలం మేయిన్ లీడ్ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు కోకొల్లలు. ఉదాహరణకి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు సినిమా గనక నాగార్జున చేసి ఉంటే బిగ్ హిట్ అయి ఉండేది. ఇప్పుడు, నితిన్ సినిమా అలియాస్ రుక్మిణి కి హీరోయిన్ ఎంపికైన సరైనదేనా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

Aafiya Syed: కొన్ని సినిమాలకి టైటిల్ ఎంత ముఖ్యమో, అందుకు తగ్గ హీరో లేదా హీరోయిన్ సెలక్షన్ కూడా అంతే ముఖ్యం. కాస్టింగ్ ఫెయిల్యూర్ సినిమాలు చాలా ఉన్నాయి. కథ, కథనం, డైరెక్షన్..ఇలా అన్నీ బావున్నా కూడా, కేవలం మేయిన్ లీడ్ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు కోకొల్లలు. ఉదాహరణకి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు సినిమా గనక నాగార్జున చేసి ఉంటే బిగ్ హిట్ అయి ఉండేది. ఇప్పుడు, నితిన్ సినిమా అలియాస్ రుక్మిణి కి హీరోయిన్ ఎంపికైన సరైనదేనా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

గత కొంతకాలంగా హిట్స్ లేక కొట్టుమిట్టాడుతున్న యంగ్ హీరో నితిన్..గత చిత్రం తమ్ముడు ఫ్లాప్ కారణంగా చేతిలో ఉన్న ఎల్లమ్మ, సారీ చిత్రాలు చేజారిపోయాయి. మరికొన్ని చర్చల దశలో ఉంటే అవి కూడా ఆగిపోయాయి. ఇలాంటి, సమయంలో నాని బాధ్యత తీసుకొని నితిన్‌ని సక్సెస్ ట్రాక్ ఎక్కించడానికి సిద్ధపడ్డాడు. ఆ సినిమా అలియాస్ రుక్మిణి పేరుతో రూపొందుతోంది. ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి చక చకా షూటింగ్ సాగుతోంది.

అయితే, ఈ మధ్యకాలంలో నితిన్ నటించిన మాస్ సినిమాలను పక్కన పెట్టి తనకి బాగా అచ్చొచ్చే జానర్ కంప్లీట్ ఫ్యామిలీ సినిమాను చేస్తున్నాడు. అలియాస్ రుక్మిణి టైటిల్ ని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఫైనల్ అయిందని, ఆమెనే ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కాంతార ఛాప్టర్ 1 తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీని తెచ్చుకున్న రుక్మిణి కి ఈ సినిమాలో ఛాన్స్ అంటే ప్రాజెక్ట్‌కి బాగా కలిసి వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ టాక్ వినిపించింది.

కానీ, ఇది మీడియం బడ్జెట్ సినిమా. రుక్మిణి, ఎన్‌టిర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా డ్రాగన్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. కాబట్టి, నితిన్ సినిమాకి రెమ్యునరేషన్ పరంగా బడ్జెట్ సరిపోదని వద్దనుకున్నారట. ఆ తర్వాత తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇరుముడి సినిమాతో హిట్ అందుకొని తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న ప్రియ భవానీ శంకర్ పేరు కూడా వార్తల్లో నిలిచింది.

కానీ, వీళ్ళెవరూ రుక్మిణి కాదు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా మేనకోడలు ఆఫియా సయ్యద్ ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. తాజాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఈ బాలీవుడ్ బ్యూటీ ఎంపికైందని విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను వదిలారు. కానీ, ఇక్కడే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చక్కటి తెలుగు టైటిల్‌కి బాలీవుడ్ హీరోయిన్ ఎందుకు సెలెక్ట్ చేశారు..అసలు మ్యాచ్ అవుతుందా క్యారెక్టర్‌కి అన్న సందేహాలు మొదలయ్యాయి. భాష కాస్తైనా తెలిసుండాలి. సౌత్ హీరోయిన్స్‌కి మన తెలుగు బాగానే అర్థమవుతుంది. లుక్ కూడా సూటవుతుంది. కానీ, ఆఫియా మాత్రం కంప్లీట్‌గా నార్త్ లుక్ ఉంటుంది. మరి, మేకర్స్ ఎందుకు ఈ బ్యూటీని ఎంపిక చేశారన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ సినిమాకి మైనస్ అయితే మాత్రం బాగా ట్రఒల్ చేస్తారు.

#Nithin#Aafiya Syed#Alias Rukmini#Nani#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి