సినిమా

Fauzi Actress: ఇమాన్వీకైనా ప్రభాస్ కలిసొస్తాడా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Fauzi Actress: కొందరు హీరోలతో నటించే హీరోయిన్స్ కెరీర్‌లో మంచి స్థానానికి చేరుకుంటారు. మరీ, ముఖ్యంగా డెబ్యూ చేసిన హీరోయిన్‌కి కొందరు హీరోలు లక్కీగా మారతారు. పవన్ కళ్యాణ్ సరసన నటించిన శ్రుతి హాసన్ ఏకంగా ఐరెన్ లెగ్ ముద్రను పోగొట్టుకుంది. అంతకముందు ఎన్ని సినిమాలు చేసినా కూడా శ్రుతి హిట్ అందుకోలేకపోయింది. కానీ, గబ్బర్ సింగ్ తర్వాత కెరీర్ ఊహించని రీతిలో మారిపోయింది.

ప్రభాస్ హీరోయిన్స్ ఎక్కడ?

ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్స్‌కి ఆఇంచిన విధంగా కెరీర్ సాగదని చెప్పుకుంటుంటారు. డార్లింగ్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్‌తో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైంది శ్రీదేవి విజయ్ కుమార్. ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను లాంటి సినిమాలు చేసింది. కానీ, స్టార్ హీరోయిన్‌గా ఎదగలేదు. మన్మధుడు సినిమాతో హిట్ అందుకున్న అన్షు..ఆ తర్వాత ప్రభాస్ కి జంటగా రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత అడ్రస్ లేదు.

సాహో సినిమాతో శ్రద్ధా కపూర్ టాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రభాస్ బాహుబలి లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చేసిన సినిమా కావడంతో ఈ బాలీవుడ్ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కుతుందనుకున్నారు. కానీ, సాహో తర్వాత మళ్ళీ శ్రద్ధా తెలుగులో కనిపించలేదు. రాధే శ్యామ్ తర్వాత పూజా హెగ్డే కూడా తెలుగు తెరకి దూరమైంది. ఈ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఇమాన్వీ గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

ఇన్స్టాలో బాగా పాపులర్ అయిన ఇమాన్వీకి ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్, ప్రభాస్ కి జోడీగా సినిమాలో చేసే ఛాన్స్ అంటే అసలు ఎవరూ నమ్మరు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఫౌజీ సినిమా ఓపెనింగ్‌లో ఇమాన్వీని పరిచయం చేయడం అందరికీ ఒకింత షాకింగ్‌గా అనిపించింది. అయితే, ఈ సినిమా కోసం 2 ఏళ్ళ నుంచి ఇంకో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. ప్రభాస్ సినిమా మీదే కెరీర్ గురించి ఆశలన్నీ పెట్టుకుంది. ఒకవేళ ఈ సినిమాలో ఆమె పాత్రకి రావాల్సిన పేరు రాకపోయినా, సినిమా హిట్ అవకపోయినా ఇమాన్వీ కెరీర్ డైలమాలో పడుతుంది. చూడాలి, మరి ఫౌజీ తర్వాత ఇమాన్వీకి ఎలాంటి క్రేజ్ వస్తుందో.

#Prabhas#Hanu Raghavapudi#Imanvi#Fauzi#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి