Prabhas: ప్రభాస్ సినిమా అంటే అభిమానులకి రాను రాను ఆసక్తి తగ్గిపోతుందా!..ప్రస్తుతం ఆయన సినిమాల నుంచి వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇదే అనిపిస్తోంది. ఎప్పుడైతే, ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఏ ఒక్క సినిమా కూడా చెప్పిన తేదీకి రిలీజ్ కాలేదు. దాంతో, సోషల్ మీడియాలో ఇకవైపు నెగిటివ్ ట్రోల్స్ వస్తుంటే, ఇంకో వైపు ఓటీటీల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అసలు, ప్రభాస్ లైనప్ లో ఏంజరుగుతోంది?
ప్రస్తుతం, ప్రభాస్ నటిస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాల్సిన స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయాల్సిన కల్కీ 2 ఉన్నాయి. అయితే, గత రెండేళ్ళ నుంచి ఫౌజీ సినిమా ప్రొడక్షన్లోనే ఉండిపోయింది. ఎంతో నమ్మకంగా నిర్మాత రవి శంకర్ డిసెంబర్ 3న రిలీజ్ చేస్తామని చెప్పాడు.
కానీ, ఇంకా ఈ సినిమాకి సంబందించిన టాకీ పార్ట్ చాలానే పెండింగ్ ఉంది. దాంతో, మార్చికి పోస్ట్ పోన్ అయింది. ఈ విషయాన్ని చెప్తూ..బాహుబలి కంటే అద్భుతంగా సినిమా ఉంటుందని హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, ఎవరూ ఇప్పుడు ప్రభాస్ సినిమాల గురించి వస్తున్న వార్తలను అంతగా పట్టించుకోవడం లేదంటున్నారు. నిజమే, ఇప్పుడు ఈ సినిమాలలో ఏది ఏ స్టేజ్లో ఉందో తెలియడం లేదు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న కల్కీ సీక్వెల్..ఇప్పటి వరకూ జరిగింది కేవలం 10 రోజుల షూట్ మాత్రమే. ఇందులో, కనీసం ఒక్క షాట్ కూడా ప్రభాస్ చేసింది లేదు. ఇక, సలార్ గురించి అసలు మాట్లాడకుంటేనే బెటర్. ఇప్పట్లో, ప్రశాంత్ నీల్ సలార్ సీక్వెల్ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఆయన, పూర్తిగా ఇంకో ఏడాది వరకూ ఎన్టిర్ నటిస్తున్న డ్రాగన్ మూవీ మీదే దృష్టి పెట్టాల్సి ఉంది.
ఇక, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తోన్న స్పిరిట్ కూడా ముందు మంచి ఊపుతో స్టార్ట్ అయినప్పటికీ..ఆ తర్వాత గాడి తప్పింది. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 5న రిలీజ్ చేస్తామని సందీప్ చెప్పాడు. కానీ, తాజాగా ఆ డేట్లో బాలీవుడ్ సినిమాను దింపుతున్నారు. అంటే, గ్యారెంటీగా ప్రభాస్ స్పిరిట్ పోస్ట్ పోన్ అవుతుందని మేకర్స్ చెప్పీ చెప్పకనే చెప్పారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. దీంతో, అసలు ప్రభాస్ తన సినిమాల గురించి పట్టించుకుంటున్నాడా..? ఏ సినిమా ఏ స్టేజ్లో ఉందో తెలుస్తుందా..? లేకపోతే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? అని సినీ సర్కిల్స్లో మాట్లాడుకుంటున్నారు. మరి, ఆయన సినిమాల విషయంలో డార్లింగ్ ఇన్వాల్వ్ అయి..లైనప్ లో క్లారిటీ తెస్తే గానీ అన్నీ సెట్ అవవు.


