సినిమా

Tollywood: హీరోయిన్‌గా ఎదగాలంటే ఏం కావాలి?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: హీరోయిన్‌గా ఎదగాలంటే ఏం కావాలి? ఈ ప్రశ్నకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇతర సౌత్ భాషలలోనూ..నార్త్ బెల్ట్‌లోనూ ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు. ఎందుకంటే, అందం..అభినయం ఉన్న వాళ్ళూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. కొందరు ఈ రెండితో పాటు లక్.. అలాగే, ఇండస్ట్రీలో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏళ్ళ పాటు స్టార్ హీరోయిన్‌గా ఏలుతున్నారు.

కొందరు మాత్రం ఎందుకనో హీరోయిన్‌గా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అలాంటి వారిలో కేథరీన్ ట్రెసా ఒకరు. ఇద్దరమ్మాయిలు, పైసా, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ, కేథరీన్ మాత్రం స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. దీనికి, కారణాలు చాలానే ఉన్నాయనుకోవచ్చు.

వచ్చిన అవకాశాలలో ఎక్కువగా మొదటి హీరోయిన్ లేదా సోలో హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ సెకండ్ లీడ్ కి ఉండకపోవచ్చు. దాదాపుగా, ఇలా సెకండ్ లీడ్ చేసిన హీరోయిన్స్ అందరూ స్టార్ హీరోయిన్ ట్యాగ్‌కి దూరంగా ఉండిపోతున్నారు. సోలో హీరోయిన్‌గా భారీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకొని కమర్షియల్ సక్సెస్ అందుకుంటే, ఆ హీరోయిన్ వెనకాలే మిగతావాళ్ళు క్యూ కడుతున్నారు.

దర్శకుడు డెసిషన్ ఫైనల్:

ఒక హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వాలా వద్దా.. అనేది ఒకప్పుడు దర్శకుడి చేతిలో ఉండేది. అతను అనుకున్న విజన్‌లో పర్ఫార్మె చేస్తుందంటేనే ఆ పాత్రకి తీసుకునేవారు. కానీ, ఆ తర్వాత హీరో గారు "ఫలనా హీరోయిన్ పట్టండి"..అంటే ఆమెనే తీసుకోవాలి. లేదా, నిర్మాత చెప్పిన అమ్మాయినే ఫైనల్ చేసుకోవాల్సిందే. ఇలా, కూడా చాలామంది హీరోయిన్స్ అనుకున్న స్థాయికి రాలేకపోతున్నారు. కేథరీన్, ప్రగ్యా జైస్వాల్, నేహ శర్మ..ఇలా చెప్తూ పోతే, ఇలా స్టార్ స్టేటస్ కి దూరంగా ఉండిపోయిన వాళ్ళ లిస్ట్ చాలానే ఉంటుంది. ఈ పద్ధతి మారి..సక్సెస్ మీటర్‌లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తే చాలామంది హీరోయిన్స్ అగ్ర స్థానంలో ఉంటారు.

#Tolluwood#South Actress#Catherine Tresa#Pragya Jaiswal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి