Tollywood: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సీనియర్ హీరోలలో ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హీరోలలో ముందు బాలయ్య, ఆ తర్వాత చిరంజీవి ఉన్నారు. అంతేకాదు, వరుస హిట్స్ అందుకుంటున్న హీరోలలో కూడా బాలయ్యే నంబర్ 1. ప్రస్తుతం ఆయన, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ డ్రామాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న బాలయ్య.. గ్యాప్ లేకుండా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.
ఇటీవలే, ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయింది. అంతేకాదు, బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రకి ఎంపికైనట్టుగా తెలుస్తోంది. ఇదే, క్రమంలో బాలయ్య మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రస్తుతం ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ దర్శకుడెవరో కాదు, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి.
ఇంతకముందు బాలయ్య-అనిల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసిందే. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఇందులో, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల నటించింది. అంతేకాదు, కాజల్ అగర్వాల్ కూడా ఇదే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక, భగవంత్ లో బాలయ్యను కొత్తగా ప్రెజెంట్ చేసిన అనిల్, ఈసారి మరో అద్భుతమైన కథను రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లతో ఓ సూపర్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
దీని తర్వాత బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందట. వీరి కాంబోలో రాబోయే రెండో సినిమా ఇది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌ను 2028 సంక్రాంతి కానుకగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయడానికి అనిల్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుందట. ఇప్పటి వరకూ 9 బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న అనిల్ రావిపూడి, మైల్ స్టోన్ మూవీ 10వ సినిమాను 2027 సంక్రాంతికి తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నాడు.












