క్రైమ్

Hyderabad : తుపాకీతో బెదిరింపులు.. లూలూ మాల్‌లో రెండు కుటుంబాల ఘర్షణ!

రచన: Kumar4 నిమిషాల పఠనం

నగరం నడిబొడ్డున గల లూలూ షాపింగ్ మాల్‌లో సంచలన ఘటన వెలుగుచూసింది. కేపీహెచ్‌బీ పరిధిలోని 'లూలూ మాల్'లో తుపాకీ‌తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. వీకెండ్ రద్దీ నేపథ్యంలో మాల్‌లోని పార్కింగ్ ఏరియాలో రెండు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ..

నగరం నడిబొడ్డున గల లూలూ షాపింగ్ మాల్‌లో సంచలన ఘటన వెలుగుచూసింది. కేపీహెచ్‌బీ పరిధిలోని 'లూలూ మాల్'లో తుపాకీ‌తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. వీకెండ్ రద్దీ నేపథ్యంలో మాల్‌లోని పార్కింగ్ ఏరియాలో రెండు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ.. చివరకు తుపాకీతో బెదిరింపుల వరకు వెళ్లింది. అంతపెద్ద మాల్‌‌‌కు వీకెండ్స్‌లో చాలా మంది జనాలు వస్తుంటారు. అయితే, పబ్లిక్ ప్రదేశంలో ఓ వ్యక్తి ఏకంగా తుపాకీ తీసి బెదిరింపులకు దిగడంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. లూలూ మాల్ సెల్లార్ పార్కింగ్ బేలో కారు పార్క్ చేసే క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. దీంతో కోపోద్రిక్తుడైన ఒక వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌ను బయటకు తీసి అవతలి వ్యక్తి కుటుంబాన్ని తీవ్రంగా హెచ్చరించాడు. విషయం తెలియడంలో మాల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.కాల్పులు చోటుచేసుకుంటాయేమోనన్న భయంతో పరిస్థితి చేయి దాటకముందే కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘర్షణకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.నగరంలో అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ మాల్‌లోకి తుపాకీ కలిగిన వ్యక్తులను ఎలా రానిస్తున్నారని.. చెకింగ్ చేయడం లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాహనాల్లోనూ తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా భద్రత విషయంలో మాల్స్ బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు వ్యక్తికి గన్ లైసెన్స్ ఉందా? లేదా? అనే కోణంలో విచారిస్తున్నారు. సీసీఫుటేజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

https://x.com/bigtvtelugu/status/2076898333751402759?s=20

#Gun#warning#lulu mall#parking issue#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి