రాజకీయాలు

Komati Reddy : ఇందిరమ్మ చీరలు కట్టుకుని.. మంత్రి కోమటిరెడ్డికి షాకిచ్చిన మహిళలు

రచన: Kumar3 నిమిషాల పఠనం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రజలు రివర్స్ అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ప్రజలకు మద్దతుగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై పలుమార్లు ప్రశ్నించింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రజలు రివర్స్ అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ప్రజలకు మద్దతుగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై పలుమార్లు ప్రశ్నించింది. మహిళలకు మహాలక్ష్మి పథకం, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి పెద్దగా ఆశించిన స్పందన రాలేదు.

తాజాగా ఇదే విషయంపై నారీమణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండల కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరైన సభలో ఉన్నట్టుండి మహిళలు ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిన మహిళలు కొందరు మంత్రి కోమటిరెడ్డిపై తిరగబడ్డారు. తమకు ఇస్తానని చెప్పిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు.

అనంతరం సభ మధ్యలోనే వారు అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓ మహిళ సమాధానం ఇచ్చింది.సభ మధ్యలో నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారని ప్రశ్నించగా.. కాంగ్రెస్ అమలు చేస్తానన్న హామీలు అమలు చేయడం లేదని మండిపడింది. మహాలక్ష్మి స్కీం కింద రూ.2500 ఇవ్వడం లేదని.. ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదు, గ్యాస్ సిలిండర్ రూ.500కి ఇస్తలేరని పేర్కొంది. ఇందిరమ్మ చీరలు ఇచ్చారు కదా? అని అడుగగా.. ఇప్పటివరకు ఒక్క చీరనే ఇచ్చారని మహిళలు అసహనం వ్యక్తంచేశారు.

ఆరు గ్యారంటీలు అని చెప్పి ఒక్క పథకం కూడా సరిగ్గా ఇవ్వడం లేదని సభలోనే మంత్రి కోమటిరెడ్డిపై పలువురు మహిళలు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://x.com/TeluguScribe/status/2076864183094923466?s=20

#minister komatireddy venkatareddy#women#serious#six guarentees#impliment#comgress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి