రాజకీయాలు

BRS : రాజీనామాకు మేమంతా రెడీ.. సీఎం, మంత్రి ఉత్తమ్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్..

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వర్షాలు లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు పదే పదే డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ సర్కారు మనసు కరుగడం లేదని నేతలు ఫైర్ అవుతున్నారు.

రాష్ట్రంలో వర్షాలు లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు పదే పదే డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ సర్కారు మనసు కరుగడం లేదని నేతలు ఫైర్ అవుతున్నారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే ఆ క్రెడిట్ మాజీ సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని.. ఆయన భవిష్యత్ దూరదృష్టి వల్లే ఇప్పుడు కాళేశ్వరం..వరప్రదాయనిగా మారింది.. ఎన్‌నినో నుంచి అదొక్కటే రాష్ట్రాన్ని రక్షిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి క్రెడిట్ దక్కకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయడం లేదని.. ఒకవేళ ఎత్తిపోస్తే తమ పోరాటం వల్లే సర్కారు దిగి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ప్రజలను నమ్మిస్తారని.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అధికార పార్టీ నేతలు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందుకే ఎన్‌డీఎస్‌ఏ నివేదికను అడ్డుపెట్టుకోని నీళ్లు ప్రాజెక్టులలోకి ఎత్తిపోయడం లేదని.. ఫలితంగా కాళేశ్వరం వద్ద లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని..ఏపీ సర్కారు పోతిరెడ్డి పాడు వద్ద గోదావరి జలాలను ఎత్తిపోస్తూ సద్వినియోగం చేసుకుంటోందని బీఆర్ఎస్ లీడర్లు విమర్శిస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2076923786482647160?s=20

సీఎం రేవంత్ తన గురువు చంద్రబాబు కోసమే నీళ్లు ఎత్తిపోయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టుపెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే పలుమార్లు విమర్శించారు. కాగా, నీళ్లు లిఫ్టింగ్ చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వంలోని పలు కీలక నేతలు పదే పదే చెబుతున్నారు. ఎన్‌‌డీఎస్ఏ నివేదికను ప్రభుత్వం పాటిస్తుందని పేర్కొంటున్నారు.

కాగా, ఈ వ్యవహారంపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయాలని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమాత్రం చిన్న ప్రాబ్లమ్ వచ్చినా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము అందరం రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. పాడి వ్యాఖ్యలపై సర్కారు పెద్దలు స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

#mla padi koushikreddy#cm revanth#minister uttam#brs mla's resignnation#barraiges damage
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి