రాజకీయాలు

Cm Revanth : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేందమంత్రులతో వరుస భేటీలు!

రచన: Kumar4 నిమిషాల పఠనం

దేశరాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వరుసగా కేంద్రమంత్రులను కలిసి పలు విజ్ఞప్తులు చేస్తున్నట్టు సమాచారం. 20 రోజుల వ్యవధిలోనే రెండోసారి సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వరుసగా కేంద్రమంత్రులను కలిసి పలు విజ్ఞప్తులు చేస్తున్నట్టు సమాచారం. 20 రోజుల వ్యవధిలోనే రెండోసారి సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగళవారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్.. తెలంగాణలోని రీజనల్ రింగ్ రోడ్డు సహా జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం.

అదేవిధంగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో పనుల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం సహా.. సదరన్ పార్ట్‌కు పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి వినతిపత్రం సమర్పించినట్టు తెలిసింది. అదేవిధంగా డ్రైపోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి రాష్ట్రం నుంచి జాతీయ రహదారులను అనుసంధానం చేయడంతో పాటు పోర్టులకు దారి కల్పించేలా అనుమతులు ఇవ్వాలని వినతి చేసినట్టు తెలుస్తోంది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా కేంద్ర అధీనంలో ఉన్న భూములను బదలాయించాలని, వాటి స్థానంలో రాష్ట్రంలోని భూములను ఇవ్వనున్నట్టు సీఎం కేంద్రమంత్రికి విన్నవించినట్టు తెలిసింది.

మరికొద్దిసేపట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో మూడు ఎయిర్ పోర్టులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుమాత్రమే పూర్తిస్థాయిలో సేవలందిస్తుండగా.. త్వరితగతిన వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరనున్నారు.ఆ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయి మెట్రో ఫేస్ -1 స్వాధీనం, ఫేస్ -2 విస్తరణకు సంబంధించిన విషయాలపై కీలకంగా చర్చించనున్నట్టు సమాచారం.

#cm revanthreddy#meets#central ministers#delhi#state benifits
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి