రాజకీయాలు

Vijayashanti : పోలీసులదే తప్పు.. సొంత సర్కారుపై రాములమ్మ ఆగహ్రం!

రచన: Kumar4 నిమిషాల పఠనం

షాబాద్ ఆరు హత్యల ఘటనపై అధికార పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి పోలీసుల తీరునే తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఫైర్ అయ్యారు. పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజ్ కుమార్ బెయిల్‌పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, నిందితుడి వద్ద లంచం తీసుకుని పోలీసులు విడుదలకు సహకరించారన్న విషయం తెలిసి షాక్‌కు గురయ్యానని..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో పోక్సో కేసు నిందితుడు రాజ్‌కుమార్.. ఆరు హత్యలు చేసిన విషయం తెలిసిందే.తన మీద కేసు పెట్టి జైలుకు వెళ్లడానికి కారణమైన మైనర్ బాలిక, ఆమె తల్లి, అమ్మమ్మను దారుణంగా చంపిన అనంతరం.. తన భార్య, ఇద్దరు బిడ్డలను సైతం హతమార్చాడు. ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. ఈ నెల 11న అర్ధరాత్రి ఈ వరుస మర్డర్స్ జరగగా..నిందితుడు రాజ్ కుమార్ నిన్న వాళ్ల అమ్మమ్మ ఊర్లో గడ్డి మందు తాగా ఓ వెంచర్‌లో శవమై కనిపించాడు.

నిందితుడి మొబైల్‌లో ఓ సెల్ఫీ వీడియో, నాలుగు పేజీల సూసైడ్ నోట్ కూడా లభించినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడి మరణంతో ఈ కేసు ముగిసినట్టే అని తెలుస్తోంది.కాగా, మృతుడి మొబైల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. తనను ప్రేమ పేరుతో బాలిక వేధించిందని.. డబ్బులు ఇవ్వాలని లేదంటే జైలుకు పంపిస్తామని ఆమె తల్లి, అమ్మమ్మ వేధించారని నిందితుడు సూసైడ్ నోట్లో పేర్కొనడం గమనార్హం.

https://x.com/TeluguScribe/status/2076915362734743893?s=20

ఇదిలాఉంటే, షాబాద్ ఆరు హత్యల ఘటనపై అధికార పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి పోలీసుల తీరునే తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఫైర్ అయ్యారు. పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజ్ కుమార్ బెయిల్‌పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, నిందితుడి వద్ద లంచం తీసుకుని పోలీసులు విడుదలకు సహకరించారన్న విషయం తెలిసి షాక్‌కు గురయ్యానని ఫైర్ అయ్యారు.పోలీసులు చేసిన తప్పు వలన నిందితుడు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాడని.. మహిళలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు.

ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి, మహిళల శాంతి, భద్రతలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంతకాలం కనిపించకుండా పోయిన రాములమ్మ ఒక్కసారిగా బయటకు వచ్చి రేవంత్ సర్కారుపై విమర్శలు చేయడాన్ని సొంతపార్టీ నేతలే భరించలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి రాలేదన్నఅసహనంతో ఆమె ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

#congress#mlc vijayashanti#police#six murders case#political#criticism
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి