సినిమా

Thaman S: ఎంతైనా ఊహించుకోండి..ఆగస్ట్ 22న మెగా 158

రచన: Anshu4 నిమిషాల పఠనం

Thaman S: ఇటీవల కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అతను చెప్పినట్టుగా సినిమాలో బీజీఎం తో చెవులు, బాక్సులు బద్ధలవుతున్నాయి. ముఖ్యంగా బీజీఎం అంటే థమన్ అని ప్రతీ హీరో, దర్శకుడు బ్లైండ్ గా ఫిక్సైపోతున్నారు. ఒకప్పుడు సాంగ్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేసినప్పటికీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మెలోడి బ్రహ్మ మణిశర్మతో చేయించుకునేవారు.

కానీ, ఈ 5 ఏళ్ళలో చూసుకుంటే 90 శాతం సినిమాలకి థమన్ కనిపిస్తున్నాడు. వరుసగా బాలకృష్ణ సినిమాలకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు, ఇండస్ట్రీలో టాక్ ఎలా అయిపోయిందంటే.. బాలయ్య సినిమా అంటే థమన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడని. అందుకు తగ్గట్టే, బాలయ్య ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇవ్వడం, 'నందమూరి థమన్' అని ఆశీర్వదించడం హాట్ టాపిక్ అయ్యాయి.

ఇక, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి థమన్ నేపథ్య సంగీతం పెద్ద ఎస్సెట్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనే చెప్పేస్తున్నాడు థమన్. మీ థియేటర్స్ లో స్పీకర్స్ ని సర్వీసింగ్ చేయించి పెట్టుకోండి..మళ్ళీ అవి పగిలిపోతే నాది బాధ్యత కాదు అని. అంటే సినిమాను ఏ రేంజ్‌లో నిలబెడుతున్నాడో ఊహించుకోవచ్చు. ఇప్పుడు, అదే మాట మెగా 158 విషయంలో చెప్పి, ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాడు.

బాబీ కొల్లి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో మెగా 158 అనే సినిమాను రూపొందిస్తోంది కేవీఎన్ ప్రొడక్షన్స్. ఈ సినిమాకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే. ఈ సందర్భంగా మెగా 158 నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాబోతోంది. దీనికి, థమన్ అందిస్తున్న బీజీఎం ఎలా ఉండబోతుందో ఊహించుకోండి..అంటూ ట్వీట్ చేసి అంచనాలను పెంచాడు థమన్. చూడాలి, మరి ఈ సారి మెగాస్టార్ సినిమాకి ఏ రేంజ్ లో థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడో.

https://twitter.com/MusicThaman/status/2076710132461998362

#thamans#mega158#megastarchiranjeevi#babykolli
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి