Nagarjuna: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మన్మధుడు, కింగ్ మేకర్ నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇందులో టబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఏడాదిలోనే నాగార్జున 100వ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
గత కొన్ని రోజులుగా నాగార్జున, తన 100వ సినిమాకి బ్రేక్ ఇచ్చి..కొడుకు అఖిల్ నటించిన లెనిన్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సినిమా ప్రేక్షకులకి ఇంతగా చేరువవడానికి ప్రధాన కారణం నాగార్జున సినిమాపై పెంచిన హైప్ అని చెప్పక తప్పదు. ఇప్పటి వరకూ నాగార్జున జడ్జ్‌మెంట్ ఎప్పుడూ తప్పు కాలేదు. లెనిన్ విషయంలోనూ అంతే జరిగింది. ప్రమోషన్స్ లో నాగ్ ఎంతో నమ్మకంగా చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి.
ఈ సినిమా జూలై 10వ తేదీన బాక్సాఫీస్ వద్ద రిలీజై అటు యూస్..ఇటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ఇన్నాళ్ళు, లెనిన్ కోసం బ్రేక్ తీసుకున్న నాగార్జున మళ్ళీ తన 100 సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. అదే, సమయంలో తన కొత్త ప్రాజెక్ట్స్ కి సంబందించిన ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 'బొమ్మరిల్లు' భాస్కర్ చెప్పిన లైన్ నాగ్ కి నచ్చి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేయమని సూచించాడట.
అఖిల్ కెరీర్ లో ఓ మోస్తరు హిట్ ఇచ్చింది మోస్ట్ ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్ సినిమాతో 'బొమ్మరిల్లు' భాస్కరే. అందుకే, తనపై నమ్మకంతో నాగ్ ఒకే చెప్పాడట. అంతేకాదు, ఇకపై స్పెషల్ రోల్స్ చేయడానికి నాగ్ సిద్ధంగా లేడని, తెలుస్తోంది. ఇకపై తాను నటించే సినిమా హీరోగానే ఉంటుంది తప్ప, గెస్ట్ అపీరియన్స్ గా ఉండబోదని సమాచారం. దీనికి, కారణం 'కూలీ' సినిమాలో నాగ్ చేసిన పాత్రకి అంతగా పేరొచ్చింది లేదు. 'కుబేర' సినిమా కూడా నాగార్జునకి ఏమంత ఉపయోగపడలేదనే విషయం అందరికీ తెలిసిందే.












