సినిమా

Chiranjeevi: శేఖర్, జానీల మధ్య గొడవ..మెగాస్టార్ ఏంచేశారంటే..?

రచన: Anshu3 నిమిషాల పఠనం

Chiranjeevi: తెలుగు సినీ పరిశ్రంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయనే ఇండస్ట్రీకి పెద్దన్న. కానీ, ఆ విషయాన్ని చిరు ఏమాత్రం ఒప్పుకోరు. నేను అందరి వాడిని..ఎవరికి ఏ సమస్య వచ్చినా, నా వంతు సహాయం, సపోర్ట్ అందిస్తానని..అంతే తప్ప పెద్దరికం అనే పదంతో ఒకరి పక్షానే నిలబడి తీర్పు చెప్పేంత గొప్పవాడిని కాదంటారు.

ఇక, గత నాలుగైదు రోజులుగా డాన్సర్స్ యూనియన్ అసోషియేషన్ లో చెలరేగిన గొడవ ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్స్ మధ్య రసాభాసాగా మారింది. ఇరువురు ఒక సమయంలో పోలీసుల ముందే వాగ్విదానికి దిగారు. దీనికి సంబందించిన వీడియో కూడా అన్నీ మీడియా ఛానళ్లలో..యూటూబ్ ఛానళ్లలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి మెగాస్టార్ దిగక తప్పలేదు.

చిరుకి, అటు జానీ మాస్టర్ అన్నా..ఇటు శేఖర్ మాస్టర్ అన్నా ఎంతో ఇష్టం. వీరిద్దరు మెగా ఫ్యామిలీ హీరోలకి డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా, చెప్పాలంటే శేఖర్ మాస్టర్ చిరు సినిమాలకి ఎక్కువగా పని చేస్తుంటే, జానీ మాస్టర్ చరణ్ కి అత్యంత సన్నిహితంగా ఉంటూ..ఆయన సినిమాలకి ఖచ్చితంగా ఒక్క పాటైనా డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు.

ఇలాంటి వారి మధ్య చిన్న సమస్య తలెత్తడంతో, మెగాస్టార్ నటిస్తున్న సినిమా సెట్స్ కి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ని పిలిపించి లంచ్ సమయంలో మాట్లాడి..వారితో సరదాగా గడిపి ఇద్దరినీ ఒక్కటి చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ తో శేఖర్, జానీ ఉన్న పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇంకా ఇష్యూ ఎక్కడ పెద్దదౌవుతుందో అని గ్రహించిన చిరు త్వరగా వీరి మధ్య తగాదాను పరిష్కరించి నిజంగానే పెద్దన్న అనిపించుకున్నారు. ఇక, చిరు వీరిని పిలిచింది బాబీ సినిమా సెట్స్ కి కావడం విశేషం.

#chiranjeevi#megastar#jhonymaster#sekharmaster
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి