International

Us vs Iran: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ క్షిపణి దాడి: భారతీయ సిబ్బంది మృతి!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు చివరకు ఇతర దేశాల అమాయక పౌరుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన రెండు చమురు నౌకలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

 పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు చివరకు ఇతర దేశాల అమాయక పౌరుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన రెండు చమురు నౌకలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు భారతీయులు కాగా, నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.

 ఒమన్ ప్రాంతీయ జలాల గుండా ప్రయాణిస్తున్న యూఏఈ నౌకలు 'మొంబాసా', 'అల్ బహియా'లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో ఈ విధ్వంసానికి పాల్పడింది. ఈ దుశ్చర్యను యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన మాత్రమే కాక ప్రాంతీయ భద్రతకు ముప్పని హెచ్చరించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ఇరాన్ చర్యకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.

 ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా సేనలు ఇరాన్‌పై వైమానిక దాడులను మరింత ఉధృతం చేశాయి. ఇరాన్ దాడుల సామర్థ్యాన్ని నాశనం చేయడానికి సరికొత్త వ్యూహాత్మక దాడులను ప్రారంభించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తాము ఇరాన్‌ను బలంగా దెబ్బతీస్తున్నామని, హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తెచ్చుకుని రవాణా దిగ్బంధాన్ని మరింత కఠినతరం చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వేదికగా సంచలన ప్రకటన చేశారు.

 ఈ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతా బాధ్యతలు తామే చూసుకుంటున్నందున, వాటి నుండి ప్రత్యేక రక్షణ రుసుమును వసూలు చేయనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ తాజా యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 7.8 శాతం ఎగబాకి బ్యారెల్‌కు 81.92 డాలర్లకు చేరుకుంది. రాబోయే రోజుల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#HormuzStraitAttack#UAEOilTankersHit#IranMissileStrike#IndianCrewCasualty#USIranConflict#BrentCrudeSpike
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి