తెలంగాణ

TG : సురేఖను పదవి నుంచి తొలగించడానికి కారణమిదే : రాజాసింగ్

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. తన కూతురు కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. తన కూతురు కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సురేఖను మంత్రి వర్గం నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం పంపిన లేఖ లోక్‌భవన్‌కు చేరింది.

ఈ ప్రతిపాదనపై గవర్నర్ అధికారిక నిర్ణయం తీసుకోవడమే మిలిగింది.అయితే, తన పదవి కాపాడుకోవడానికి కొండా సురేఖ ఎంతో ప్రయత్నించారు. అధిష్టానం పెద్దలను కలిసి విన్నవించారు. తన కూతురు వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, అందులో తన తప్పు లేదని, కావాలనే తనను టార్గెట్ చేశారని హస్తిన పెద్దలకు వివరించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఏఐసీసీ పెద్దలు ఆమె వివరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిసింది.

మంత్రి పదవి కాపాడుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం కావడంతో తాజాగా ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా, కొండా సురేఖ పదవి పోవడానికి గల అసలు కారణాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు నుంచే ఈ కథ మొదలైందని పేర్కొన్నారు. డబ్బుల వాటా విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతోనే ఈ వివాదం ముదిరిందని.. సురేఖను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించిన రాజాసింగ్.. డబ్బుల వివాదమే కొండా సురేఖ మంత్రి పదవి పోవడానికి కారణమని ఆరోపించారు.

https://x.com/inewstelugu/status/2095407482239910238?s=20

ఇదిలాఉండగా, తనను కేబినెట్ నుంచి తప్పిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తనకే తెలియదని నిన్న కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తాజాగా ఆమెను పదవి నుంచి తప్పించడంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తారా? లేదా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరుతారా? అనేది తెలియాల్సి ఉన్నది. అనుచరులతో చర్చించాక ప్రెస్‌మీట్ పెట్టి తన భవిష్యత్ కార్యాచరణను సురేఖ ప్రకటిస్తారని ప్రచారం జరుగతోంది.

#konda sureka#minister post#removed#cm revanth reddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి