తెలంగాణ

Konda Surekha: కొండా సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డిపై వేటు.. గద్వాల విజయలక్ష్మికి పదవి

రచన: NK5 నిమిషాల పఠనం

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఎసిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఆమెతో రాజీనామా చేయిస్తారా? బర్తరఫ్ చేస్తారా? అన్న ఉత్కంఠకు తెర దించింది కాంగ్రెస్ హైకమాండ్. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో..

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఎసిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఆమెతో రాజీనామా చేయిస్తారా? బర్తరఫ్ చేస్తారా? అన్న ఉత్కంఠకు తెర దించింది కాంగ్రెస్ హైకమాండ్. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు సిఫారసు లేఖ పంపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం లోక్ భవన్ నుంచి అధికారిక ఉత్వర్వులు వెలువడనున్నాయి. రాజీనామా చేసేందుకు కొండా సురేఖ అంగీకరించకపోవడంతో బర్తరఫ్ చేయాలని హైకమాండ్ డెసిషన్ తీసుకుంది.

ఒక మంత్రిని క్యాబినెట్ లోకి తీసుకోవాలన్నా, బర్తరఫ్ చేయాలన్నా రాజ్యాంగ పరమైన ప్రాసెస్ ఉంటుంది. ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో ఏ మంత్రి ఉండాలి అనేది సిఫారసు చేస్తూ గవర్నర్ కు లేఖ రాస్తారు. ఆ సిఫారసు మేరకే గవర్నర్ క్యాబినెట్ లోకి మంత్రులను తీసుకుంటారు. అదే విధంగా క్యాబినెట్ లో ఉన్న మంత్రులను తొలగించాలంటే కూడా అదే విధంగా సిఫారసు లేఖను రాస్తారు.

ఆ సిఫారసు లేఖ మేరకే గవర్నర్ డెసిషన్ తీసుకుంటారు. సిఫారసు లేఖకు గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఆమోద ముద్ర వేసి బర్తరఫ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులను లోక్ భవన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గవర్నర్ కు సీఎంవో సిఫారసు లేఖ పంపినట్లుగా తెలుస్తోంది. సాయంత్రానికే బర్తరఫ్ కు సంబంధించి అధికారిక ఉత్తర్వులు లోక్ భవన్ నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి.

అటు చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఆయనపై వేటు వేసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డిని తొలగించింది. చిన్నారెడ్డి స్థానంలో జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియామకం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నేరెళ్ల శారదను అపాయింట్ చేశారు.

కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికకు హైకమాండ్ ఆమోద ముద్ర వేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ వినిపించిన వాదనలకు హైకమాండ్ మొగ్గు చూపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మొదటి నుంచి కూడా కొండా సురేఖ, ఆమె ఫ్యామిలీ వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని ప్రభుత్వం, ముఖ్యమంత్రి, క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాలతో పోరాటం చేయాల్సింది పోయి ప్రభుత్వంలో ఉన్న వారే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా, ఇరకాటంలో పడేసేలా, ప్రతిపక్షాలకు అస్త్రాలను అందించే విధంగా వ్యవహరిస్తున్నారు.. అందులో ప్రధానంగా కొండా సురేఖ కుటుంబంతో బాగా ఇబ్బంది అవుతోందని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ నే టార్గెట్ చేయడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నారు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇలాంటి ధిక్కార స్వరాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం వివరించింది. దీంతో కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలకు హైకమాండ్ నిర్ణయించింది.

#Konda Surekha#Sacked#Telangana Cabinet#Cm Revanth Reddy#Congress High Command#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి