తెలంగాణ

BC Women: కొండా సురేఖ బీసీ కార్డుకు రేవంత్ సర్కార్ కౌంటర్.. ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు

రచన: NK3 నిమిషాల పఠనం

BC Women: కాంగ్రెస్ లో కలకలం రేపిన కొండా సురేఖ ఎసిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖపై వేటు వేసింది హైకమాండ్. మంత్రివర్గం నుంచి ఆమెను బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చిన్నారెడ్డిపైనా వేటు వేసింది హైకమాండ్. తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించింది.

BC Women: కాంగ్రెస్ లో కలకలం రేపిన కొండా సురేఖ ఎసిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖపై వేటు వేసింది హైకమాండ్. మంత్రివర్గం నుంచి ఆమెను బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చిన్నారెడ్డిపైనా వేటు వేసింది హైకమాండ్. తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించింది.

తనపై చర్యలు తీసుకుంటే బీసీలంతా ఏకమవుతారని కొండా సురేఖ కాంగ్రెస్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనపై చర్యలను నిలువరించేలా ఆమె బీసీ మహిళ కార్డును ప్లే చేశారు. అయితే, కొండా సురేఖపై వేటు పడేలా చూడటంతో పాటు ఆమె బీసీ కార్డుకు కౌంటర్ కూడా ఇచ్చింది రాష్ట్ర నాయకత్వం. ముగ్గురు బీసీ మహిళలకు అగ్ర తాంబూలం ఇచ్చింది. వారికి కీలక పదవులు అప్పగించింది. ఒక బీసీ పదవి బర్తరఫ్ తో ముగ్గురు బీసీ మహిళలకు పదవుల్లో చోటు ఇచ్చింది.

రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి.. ఆయన స్థానంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది ప్రభుత్వం. విజయలక్ష్మి మున్నూరు కాపు. ఆమెను ప్రణాళికా బోర్డు వైస్ చైర్ పర్సన్ గా అపాయింట్ చేసింది. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారదను (గౌడ) నియమించింది రేవంత్ సర్కార్. ఇక కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (KUDA) చైర్ పర్సన్ గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిని (పద్మశాలి) అపాయింట్ చేసింది ప్రభుత్వం. ఇలా ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇవ్వడం ద్వారా కొండా సురేఖ ప్లే చేసిన బీసీ కార్డుకు ధీటుగా కౌంటర్ ఇచ్చింది రేవంత్ సర్కార్.

#BC Women#BC Card#Konda Surekha#Cm Revanth Reddy#Telangana Congress#Gadwal Vijayalakshmi#Nerella Sharada#Gundu Sudha Rani#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి