సినిమా

Official: "జైలర్ 2" రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమే..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Official: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'జైలర్ 2'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని (అక్టోబర్ 15) మేకర్స్ అధికారికంగా కన్‌ఫర్మ్ చేశారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023లో రజినీ-నెల్సన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' కి సీక్వెల్ గా రూపొందుతోంది. అయితే, ఈ మధ్య ఈ సినిమాకి సంబందించి ఆశించిన అప్‌డేట్స్ రాకపోవడంతో విడుదల వాయిదా పడిందని వార్తలు ప్రసారం కాగా, వాటికి మేకర్స్ (సన్ పిక్చర్స్) చెక్ పెట్టారు.

ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జైలర్ 2 థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు విడుదల తేదీతో ఉన్న రజినీ పోస్టర్‌ను కూడా వదిలారు. వాస్తవానికి 'జైలర్ 2' సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదల కావడం కష్టమేనని అంతటా ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో రూమర్స్ కి చెక్ పెడుతూ సన్ పిక్చర్స్ వారు పోస్టర్ తో అప్‌డేట్ ఇచారు. ముందు ప్రకటించినట్లే 2026, అక్టోబర్ 15న వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానుందని కన్‌ఫర్మ్ చేశారు. ఇక, ఇప్పటి వరకూ జైలర్ 2 నుంచి రిలీజ్ చేసిన టీజర్, రిలీజ్ డేట్ గ్లింప్స్ బాగానే అంచనాలను రేకెత్తించాయి. ఇటీవల వచ్చిన పూర్ణ స్పెషల్ నంబర్ కూడా బాగా వైరల్ అయింది.

మరి, పార్ట్ 1 మాదిరిగానే జైలర్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంశం సృష్టిస్తుందో చూడాలి. కాగా, ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, కోలీవుడ్ విలక్షణ నటుడు ఎస్.జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిర్నా, అన్నా రాజన్, యోగిబాబు, జతిన్ శర్మ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, విజయ్ సేతుపతి, స్పెషల్ క్యామియో రోల్స్ లో సందడి చేయనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

#rajinikanth#jailer 2#nelson dileep kumar#ramyakrishna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి