తెలంగాణ

HYD : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?

రచన: Kumar4 నిమిషాల పఠనం

సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంల మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు మాయమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంల మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు మాయమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పెద్దఎత్తున వెపన్స్, బుల్లెట్స్ మిస్ కావడంతో ఆర్మీ ఇంటెలిజెన్స్ సైతం రంగంలోకి దిగింది.ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టగా.. ఇంతవరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే, బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త కోణం వెలుగుచూసినట్టు సమాచారం.

ఆర్మీ ఆయుధాల చోరీ వెనుక హనీట్రాప్ ? జరిగి ఉండొచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్మీ సిబ్బందిని హనీట్రాప్‌లోకి దించి కీలక సమాచారం సేకరించారా? అనే కోణంలో విచారణ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రెజిమెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర నిఘా బృందం ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

సిబ్బంది ఫోన్ కాల్స్, కాంటాక్ట్స్, సోషల్ మీడియా కార్యకలాపాలపై తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. మద్రాస్ రెజిమెంట్‌లో నాలుగు AK-203 రైఫిళ్లు, 7 పిస్తోళ్లు, 1 ఇన్సాస్ వెపన్ చోరీకి గురయ్యాయి. చోరీ చేసిన ఆయుధాలకు సరిపోయే తూటాలను కూడా దుండగులు ఎత్తుకెళ్లడంతో సిబ్బందిపైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయుధాల చోరీ పక్కా ప్రణాళికతోనే జరిగిందని పోలీసుల అనుమానిస్తున్నారు.

క్యాంపు, ఆయుధాల వివరాలు బాగా తెలిసిన వ్యక్తులపై నిఘా ఉంచినట్టు సమాచారం. ఇదే సమయంలో ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభ్యం కావడంతో ఏదో పెద్దఎత్తున జరగబోతుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో బకెట్‌లో డిటోనేటర్లు గుర్తించిన ఆర్మీ అధికారులు వాటిని నిర్వీర్యం చేసినట్టు సమాచారం. అయితే, ఆయుధాల చోరీ.. డిటోనేటర్ల లభ్యానికి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. కాగా, 48 గంటలు గడిచినా ఆయుధాల చోరీ కేసులో ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో దర్యాప్తులో పోలీసులు వేగం పెంచినట్టు సమాచారం.

https://x.com/pulsenewsbreak/status/2095382296782340459?s=20

#honeytrap#bollaram#army weapons#theft case#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి